Rishabh Pant Record India vs South Africa | చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాట్స్మన్ రిషబ్ పంత్ (Rishabh Pant ) అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఇండియా సౌత్ ఆఫ్రికా ( India vs South Africa ) మధ్య జరుగుతున్న తోలి టెస్ట్ మ్యాచ్ లోఈ ఘనత సాధించాడు.
ఈ రికార్డ్ బ్రేక్ చేయడంతో లెజెండరీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ను అధిగమించాడు. 103 టెస్టుల్లో సెహ్వాగ్ 90 సిక్సర్లు కొడితే .. పంత్ మాత్రం 48 టెస్టుల్లోనే సెహ్వాగ్ ను అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో పంత్ కొట్టింది రెండు సిక్సులే. కానీ ఈ ఫార్మాట్ మొత్తంలో తాను కొట్టిన సిక్సులను 92కు పెంచుకున్నాడు. గాయం కారణంగా కాస్త బ్రేక్ వచ్చినా కూడా.. రిషబ్ పంత్ మాత్రం తన ఫార్మ్ ని కొనసాగిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా తాను ఏంటో నిరూపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇక ఇదే ఫార్మ్ లో పంత్ ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చెయ్యాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.





















