విశ్వం మూలం వారణాసి నగరమే! అందుకే డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్
డైరెక్టర్ రాజమౌళి తయారుచేసిన మాస్టర్‌పీస్.. మహేష్‌బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా టైటిల్ నిన్న శనివారం అఫీషియల్‌గా రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ సినిమాలో వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుడి క్షేత్రం చుట్టూరానే మూవీ స్టోరీ మొత్తం నడుస్తుంది అన్నట్లు దాదాపు మనకి అర్థమైపోయింది. ఎప్పుడో త్రేతాయుగం నుంచి.. రాబోయే భవిష్యత్తు వరకు ఈ వారణాసి నగరం ఇంపార్టెన్స్‌ని చూపిస్తూ వచ్చారు మూవీలో. అంటే వారణాసిని యుగయుగాలుగా ఉన్న అతి ప్రాచీన నగరంగా చూపించారు.
ఈ మూవీనే కాకుండా.. ఇంతకుముందు ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి మూవీలో కూడా ప్రపంచం అంతమయ్యేనాటికి కూడా చిట్టచివరి నగరంగా కాశీ నగరం ఉందన్నట్లు చూపించారు. అయితే అసలు ఎందుకిలా? కేవలం వారణాసి నగరాన్నే ఇంత గొప్పగా ఎందుకు చూపిస్తున్నారీ డైరెక్టర్లు? మన డైరెక్టర్లే కాదు.. మన పురాణగ్రంథాలు కూడా వారణాసి నగరాన్ని హిందూ టైమ్‌లైన్‌లో అత్యంత గొప్ప నగరంగా చూపించాయి.
మన సైన్స్ కూడా వారణాసి నగరం అసలు ఎప్పుడు పుట్టిందో ఇప్పటికీ క్లియర్‌గా కనిపెట్టలేకపోయింది. అందుకే ఈ నగరాన్ని ప్రపంచంలోనే అతి ప్రాచీన నగరాల్లో ఒకటిగా.. ఇంకా మాట్లాడితే.. ప్రపంచంలోని ప్రాచీన నగరాలన్నింటికంటే ప్రాచీనమైనదిగా కూడా చెబుతారు. మరి నిజంగా వారణాసి వెనుక అంత చరిత్ర ఉందా? భూమి భవిష్యత్తు కూడా వారణాసి చుట్టూనే తిరగబోతోందా? అన్నింటికంటే ముఖ్యంగా ఈ నగరంలో వెలసిన స్వయంభూ కాశీ విశ్వేశ్వరుడి చరిత్ర ఏంటి? అసలు కాశీ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు? దీని వెనకున్న మిస్టరీ ఏంటి? పదండి.. ఈ రోజు మిస్టరీ టూ హిస్టరీలో తెలుసుకుందాం.





















