అన్వేషించండి

AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 

Ramoji Excellence Awards ceremony | తన జీవితంలో ఫలానా పని చేసిపెట్టాలని రామోజీరావు ఎవరినీ అడగలేదని, అలాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

హైదరాబాద్: రామోజీ రావు ఒక అక్షర యోధుడు అని తెలుగుజాతి గర్వించదగిన రామోజీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డులు అత్యున్నత స్థాయికి చేరుతాయని చంద్రబాబు ఆకాంక్షించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆదివారం నాడు జరిగిన రామోజీ ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా, చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం రామోజీ దేన్నైనా వదులుకున్నారని, తన జీవితంలో ఫలానా పని చేసిపెట్టాలని ఆయన ఎవరిని అడిగింది లేదని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఫోన్ చేస్తే రామోజీరావు ఎవరూ ఏ పని అయినా చేసేవారని తెలిపారు. రామోజీ ఒక పోరాటయోధునిగా మిగిలిపోయారని, నికార్సైన జర్నలిజంతో ఆయన తెలుగుజాతికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఎక్కడ అవినీతి, దోపిడీ, అన్యాయం జరిగినా ప్రజల పక్షానే నిలబడ్డారని, ప్రతిపక్షం లేకపోతే ప్రజల పక్షాన ప్రతిపక్షంగా నిలబడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు.

సామాజిక సేవలోనూ రామోజీకి తిరుగులేదు..

సామాజిక సేవలోనూ రామోజీకి తిరుగులేదని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. లాతూర్ భూకంపం అయినా, హుద్ హుద్ తుఫాన్ అయినా, సునామీ అయినా తమ సంస్థల ద్వారా ప్రభావిత ప్రాంతాలను ఆయన ఆదుకున్నారని తెలిపారు. తెలుగుభాషకు రామోజీ రావు చేసిన సేవకు కొలమానం లేదని, తెలుగు భాషను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రిగా ఏం చేయాలో అదంతా చేస్తామని హామీ ఇచ్చారు. సరికొత్త తెలుగు పదాలను సృష్టించి కొత్త డిక్షనరీని రూపొందించడంలో రామోజీ రావు పాత్ర అద్భుతమని చంద్రబాబు కొనియాడారు. రామోజీ ఎక్సెలెన్స్ అవార్డులు అందుకున్న వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈనాడు ద్వారా సుశిక్షితులైన జర్నలిస్టుల ద్వారా రామోజీ నికార్సైన జర్నలిజం చేశారని, రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.


AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 

50 ఏళ్ల తర్వాత ఏం చేయాలో రామోజీ ఆలోచించి ఫిల్మ్ సిటీ లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు చేపట్టారని చంద్రబాబు అన్నారు. రామోజీపై ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గని వ్యక్తి ఆయనని, ప్రభుత్వాలతో పోరాడి మనుగడ సాధించారని తెలిపారు. ఈనాడు ఒక విశ్వవిద్యాలయం లాంటిదని, ఇక్కడ నేర్చుకున్న వారే దేశ విదేశాల్లో పత్రికా రంగంలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడాలనే స్ఫూర్తిని ఆయన పెట్టిన న్యూస్ మీడియా ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.


AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 

ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు కృషిచేశారు: ఎన్వీ రమణ
హైదరాబాద్‌: రామోజీరావు మీడియా ద్వారా దేశాభివృద్ధికి విశేష కృషి చేశారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. రామోజీ నిబద్ధత కలిగిన వ్యక్తి అని, ఎప్పుడూ అధికారాన్ని కోరుకోలేదన్నారు. రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్‌లెన్స్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తన పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేశారని రామోజీరావు సేవల్ని కొనియాడారు. 

‘రామోజీరావు ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. స్వప్రయోజనాల కోసం రామోజీరావు ఎప్పుడూ తన పత్రికను వాడుకోలేదు. ఆయన వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎన్నో సమస్యలపై మీడియా అధినేతగా ప్రజల పక్షాన నిలిచి పోరాం చేశారని’ అన్నారు. ఈ సందర్భంగా రామోజీ ఫౌండేషన్‌ రూపొందించిన డిక్షనరీని మాజీ సీజేఐ రమణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

రామోజీరావు జయంతిని పురస్కరించుకొని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఏర్పాటు చేసిన ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ సీజేఐ ఎన్వీ రమణ, తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, బండి సంజయ్‌, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli and Rohit Sharma Records: బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli and Rohit Sharma Records: బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
The Girlfriend OTT : ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
India Richest MLA: దేశంలో అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేలు వీరే.. ఆస్తుల వ్యత్యాసం రూ.3383 కోట్లు
దేశంలో అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేలు వీరే.. ఆస్తుల వ్యత్యాసం రూ.3383 కోట్లు
Adilabad Road Accident: లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొని ఇద్దరు మృతి.. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొని ఇద్దరు మృతి.. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
Vanavaasam Song Lyrics: వనవాసం సాంగ్ లిరిక్స్... సుమ కనకాల కొడుకు రోషన్ 'మోగ్లీ'లో కొత్త పాట... రామాయణం గుర్తు చేసేలా!
వనవాసం సాంగ్ లిరిక్స్... సుమ కనకాల కొడుకు రోషన్ 'మోగ్లీ'లో కొత్త పాట... రామాయణం గుర్తు చేసేలా!
Embed widget