Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Vizag: విశాఖలోని బాలిక జువనైల్ హోమ్ లో నుంచి కొంత మంది గోడ దూకి బయటకు వచ్చారు. టాబ్లెట్లు ఇచ్చి మానసిక రోగులుగా చూస్తున్నారని వారు ఆరోపించారు.

Vizag Juvenile Home: విశాఖ వ్యాలీ సమీప జువనైల్ హోమ్స్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు మాకు లోపల నరకం చూపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలికల తీవ్ర ఆవేదన స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తున్న మానసిక రోగులుగా మారుస్తున్నా రంటూ ఆరోపణలు చేశారు. బాలికలు ఆత్మహత్య యత్నంకు ప్రయత్నం చేయడంతో కలకలం రేగింది.
ఈ ఘటనపై హోంమంత్రి అనిత్ వెంటనే స్పందించారు. నగర పోలీస్ కమీషనర్ శంఖబ్రత బాగ్చీ మరియు విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి .. బాలికల ఆరోపణలపై ఆరా తీశారు. మహిళా పోలీస్ అధికారి,తహశీల్దార్ నేతృత్వంలో బాలికలతో మాట్లాడి,పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఆరోపణలు వాస్తవమని తెలితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జువనైల్ హోమ్ సూపర్డెంటెంట్ సునీత ఈ అంశంపై స్పందించారు. వివిధ సమస్యలు తో పిల్లలు జువనైల్ హోమ్ లో చేర్చుతారని అన్నారు. హోమ్ లో ప్రస్తుతం 60 పిల్లలు ఉన్నారని.. 60 మంది పిల్లలు లో ఐదుగురు తో హోమ్ లో సమస్య ఉందన్నారు. రెండు రోజులు నుంచి ఐదుగురు పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని.. ఈ విషయాన్ని ఆరిలోవ పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకువెళ్ళమన్నారు. ఈ ఐదుగురు పిల్లలలో నలుగురు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా జిల్లాలకు చెందిన వారు అన్నారు. ఒకరు కోర్టు ద్వారా హైదరాబాద్ నుంచి వచ్చారన్నారు. కమిటీ ద్వారా అనుమతులతో పిల్లలను విడుదల చేస్తామని చెప్పారు.
Also Read: Hanumakonda Murder Case: హనుమకొండలో పట్టపగలే దారుణం, నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ దారుణహత్య
మహిళా జువనైల్ హోమ్ లో ఉన్న కొంత మందిని చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కున వారిని జువనైల్ హోమ్స్ కు పంపుతారు. మైనర్లుగా ఉన్నప్పుడు చేసే నేరాల వల్ల వారిని ఇక్కడికి పంపుతారు. అయితే ఇక్కడకు వచ్చిన కొంత మంది తమను బయట పంపాలని డమాండ్ చేయడంతో నిర్వహాకులు ఒప్పుకోకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.
అయితే వీరు ఇలా గోడలు దూకి బయటకు రావడం జువనైల్ హోం నిర్వాహకుల నిర్లక్ష్యమేనని భావిస్తున్నారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

