అన్వేషించండి

CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు

Hyderabad Development : రవాణా రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. దావోస్‌లో సీఐఐ, మోటార్ కార్ప్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

CM Revanth Reddy Davos Tour: తెలంగాణలో రవాణా రంగ అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి  పిలుపునిచ్చారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను ప్రపంచ స్థాయి రవాణా మౌలిక సదుపాయాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పటిష్ఠ ప్రణాళికలు రూపొందించిందని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు, మౌలిక వనరుల అభివృద్ధి సంస్థలు కలిసి రవాణా రంగంలో పెట్టుబడులు పెట్టాలని, ఈ రంగాన్ని మరింత విస్తరించి తెలంగాణను దేశానికి మోడల్ రాష్ట్రంగా మార్చేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

తెలంగాణలో రవాణా విప్లవం
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. 4 కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుందని హామీ ఇచ్చారు.

ఈవీ వాహనాలకు ప్రోత్సాహం
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వాహనాల (EV) వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. విద్యుత్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలను రద్దు చేయడం ద్వారా ఈ రంగానికి ప్రోత్సాహం అందజేస్తోంది. దేశవ్యాప్తంగా ఈవీ వాహనాల విక్రయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయడంలో అర్బన్ మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. కోటి 20 లక్షలకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న మెట్రో రైల్ నెట్వర్క్‌ను మరింత విస్తరించేందుకు కొత్తగా 100 కిలోమీటర్ల మెట్రో లైన్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 3  వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్‌లో పర్యావరణ అనుకూల రవాణా సేవల విస్తరణలో భాగంగా, 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను నగర రోడ్లపై నడిపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీని ద్వారా రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించడంలో కీలక ముందడుగు వేయబోతోంది.

డ్రైపోర్ట్ ద్వారా కొత్త అవకాశాలు
తీరప్రాంతం లేని తెలంగాణ రాష్ట్రానికి వాణిజ్య రంగంలో లోటు ఏర్పడకుండా, కొత్తగా డ్రైపోర్టును నిర్మించి రాష్ట్రాన్ని వేర్‌హౌజ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వస్తోంది. ఈ డ్రైపోర్టును ఏపీలోని మచిలీపట్నం పోర్టుతో ప్రత్యేక రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానం చేయనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సదుపాయాలను అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ కాలుష్యంతో, వేగంగా ప్రయాణించగల సౌకర్యాలే నగర అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కీలకమని సీఎం అభిప్రాయపడ్డారు.

Also Read : Gandhi Bhavan fight: గాంధీభవన్ ముందు కాంగ్రెస్ యువ కార్యకర్తల స్ట్రీట్ ఫైటింగ్ - పదవుల కోసం పోరాటం ఇలాగే ! వీడియో

టాప్ హెడ్ లైన్స్

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget