Gandhi Bhavan fight: గాంధీభవన్ ముందు కాంగ్రెస్ యువ కార్యకర్తల స్ట్రీట్ ఫైటింగ్ - పదవుల కోసం పోరాటం ఇలాగే ! వీడియో
Congress: గాంధీభవన్ ముందు కంగ్రెస్ యువ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పార్టీ పదవుల కోసం వారు ఇలా కొట్టుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Congress youth workers clashed in front of Gandhi Bhavan: టిక్కెట్లు దక్కని వారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం ఎన్నికల సమయంలో సహజంగానే జరుగుతుంది. కానీ ఇప్పుడు పార్టీ పదవుల కోసం గాంధీభవన్ లోనే స్ట్రీట్ ఫైటింగ్ కు దిగుతున్నారు. కొత్తగూడెం నుంచి పార్టీ పదవుల కోసం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు. పొంగులేటితో పాటు భట్టి వర్గీయులు కొత్తగూడెంలో పార్టీ పదవులు తమకు కావాలంటే తమకు కావాలని వాదనకు దిగారు. పార్టీ నేతలు వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా కూడా వినలేదు. చివరికి మాటా మాటా పెరిగి కొట్టుకున్నారు. గాంధీభవన్ ఎదుట ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పరుగులు పెట్టారు. రోడ్డు మీద ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు.
బ్రేకింగ్ న్యూస్
— Journalist Pallavi (@pallavi_journo) January 22, 2025
గాంధీభవన్ లో పదవుల కోసం తన్నుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు.@revanth_anumula pic.twitter.com/uQQXV92FHM
కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో మిత్రపక్షం అయిన సీపీఐకి కేటాయించారు. ఆ స్థానం నుంచి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ ఇంచార్జ్ గా ఎవరూ లేరు. అదే సమయంలో కాంగ్రెస్లో ముఖ్య నేతలందరికీ వర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కేబినెట్ లో మంత్రులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. వీరు ముగ్గురిలో భట్టి విక్రమార్క మాత్రమే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయనకు జిల్లా వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు.
Also Read: సీఎం చంద్రబాబుకు నారా భువనేశ్వరి షాక్, ఎవరైనా సరే టిక్కెట్ కొనుక్కుని రావాల్సిందేనని వ్యాఖ్యలు
అయితే బీఆర్ఎస్ తో సరిపడక తర్వాత పొంగులేటి, తుమ్మల కాంగ్రెస్ లో చేరి గెలిచారు. వీరిద్దరికీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అనుచరులు ఉన్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పదవులు అనుభవించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పదవులు తీసుకుని నియోజకవర్గంలో దందాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పొంగులేటి కూడా తమ వర్గీయులకు పదవులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తుూండటంతో భట్టి విక్రమార్క వర్గీయులు ఎదురుదాడి చేశారని.. తెలుస్తోంది.
గాంధీభవన్ లో ఇలాంటి దాడి జరగడంత.. అది కూడా అధికార పార్టీకి చెందిన వ్యవహారం కావడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. పార్టీ పదవుల్ని కూడా సరిగ్గా పంచుకోలేరు కొట్టుకుంటారు.. వీరు ఇతరుల్ని అంటారా అని ప్రశ్నిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

