అన్వేషించండి

Nara Bhuvaneshwari: సీఎం చంద్రబాబుకు నారా భువనేశ్వరి షాక్, ఎవరైనా సరే టిక్కెట్ కొనుక్కుని రావాల్సిందేనని వ్యాఖ్యలు

Vijayawada Euphoria Musical Night | ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల సహాయార్థం విజయవాడలో యుఫోరియా మ్యూజికల్ నైట్ ఫిబ్రవరి 15న నిర్వహించనున్నామని నారా భువనేశ్వరి తెలిపారు.

Euphoria Musical Night | అమరావతి: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించనున్నారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ నిర్వహించనున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు (Chandrababu) హాజరవుతారని, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను కూడా ఆహ్వానిస్తామని ఆమె తెలిపారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఈ కార్యక్రమం గురించి నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ కార్యక్రమానికి హాజరు కావడానికి సీఎం చంద్రబాబు అయినా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా టికెట్లు కొనాల్సిందే. ఫ్యామిలీతో హాజరయ్యేందుకు వారు బుక్ మై షోలోగానీ, ఇతర విధానంలో టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సినిమాల్లో సక్సెస్ అయిన నా తండ్రి, స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. కేవలం రూ.2 కు కిలో బియ్యం ఇచ్చి పేదల ఆకలి తీర్చారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు అవకాశం కల్పించింది ఆయనే. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తూనే, మరోవైపు అభివృద్ధి వైపు ఫోకస్ చేశారు. అదే బాటలో చంద్రబాబు నడుస్తున్నారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ స్థాపించి ప్రభుత్వ సహాయం లేకుండానే ముందుకు వెళ్తున్నాం. తుపానులు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి ఎంతో మందిని ఆదుకున్నాం. మా వంతు సాయం కూడా చేసి బాధితులకు అండగా నిలిచాం’ అన్నారు.


Nara Bhuvaneshwari: సీఎం చంద్రబాబుకు నారా భువనేశ్వరి షాక్, ఎవరైనా సరే టిక్కెట్ కొనుక్కుని రావాల్సిందేనని వ్యాఖ్యలు

మ్యూజిక్ డైరెక్టర్ థమన్
‘తలసేమియా సమస్య తీవ్రత అందరికీ తెలిసిందే. ఈ వ్యాధి ఉన్న వారికి సహాయం చేసేందుకు బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా సేవలు అందిస్తున్నాం. బడ్ల్‌ డొనేషన్ ఆపదలో ఉన్న ఒకరి ప్రాణాన్ని సైతం నిలుపుతుంది. కానీ కొందరిలో రక్తదానం అంటే భయం నెలకొంది. మనం ఇచ్చే రక్తం మరొకరి జీవితాన్ని నిలుపుతుంది.తలసేమియా వ్యాధిపై అవగాహన కోసం ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ నిర్వహించి దీని ద్వారా వచ్చే నగదును పేషెంట్ల కోసం వినియోగిస్తాం. ఈ కార్యక్రమం కోసం అడిగిన వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంగీకరించారు. బుక్‌ మై షోలో టికెట్స్‌ అందుబాటులో ఉంచుతాం. ఓ మంచి పని కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొనండి. మీరు టికెట్స్‌ డబ్బులను సేవా కార్యక్రమం లాంటి మంచి పనులకు వినియోగిస్తామని’ ఎన్టీఆర్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.


ఎంతో గౌరవంగా భావిస్తా: థమన్
ఎన్టీఆర్ ట్రస్ట్‌తో కలిసి ఓ మంచి పనిచేసే అవకాశం తనకు దక్కడంపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో థమన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా బాధితులకు అండగా నిలుస్తోంది. అందులో భాగంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 15న ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కాన్సర్ట్‌ను కుటుంబంతో వచ్చి విజయవంతం చేయాలని, మంచి పనిలో మీరు భాగస్వాములు కావాలన్నారు. బాలకృష్ణ నటించిన అఖండతో పాటు ఇటీవల విడుదలై హిట్ మూవీ డాకు మహారాజ్‌కు థమన్ సంగీతం అందించారని తెలిసిందే.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget