అన్వేషించండి
Nara Lokesh: జ్యురిచ్ పర్యటనలో న్యూ లుక్‌లో మంత్రి లోకేశ్ - కలర్ టీ షర్ట్‌లో కొత్తగా మెరిశారు
Nara Lokesh New Look: ఏపీ మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటనలో భాగంగా జ్యురిచ్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన న్యూ లుక్‌లో టీ షర్ట్‌లో అదరగొట్టారు.

న్యూ లుక్‌లో ఏపీ మంత్రి నారా లోకేశ్
1/12

ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు వెళ్లింది. ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి లోకేశ్, మంత్రి టీజీ భరత్ ఉన్నారు. జ్యురిచ్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో ఈ బృందం భేటీ అయ్యింది.
2/12

ఈ సందర్భంగా లోకేశ్ న్యూ లుక్‌లో అదరగొట్టారు. టీ షర్టులో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.
3/12

పెట్టుబడులకు ఏపీ పూర్తిగా అనుకూలమని భారీగా పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాన్ని అమలు చేస్తుందని చెప్పారు.
4/12

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నామని లోకేశ్ పారిశ్రామికవేత్తలకు తెలిపారు. అనుమతులన్నీ 15 రోజుల్లోనే ఇచ్చేలా ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
5/12

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంది. 1053 కి.మీ.ల సుదూర తీరప్రాంతం, విశాలమైన రోడ్లు, ఎయిర్ కనెక్టివిటీ, విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం నౌకాశ్రయాలు ఉన్నాయని లోకేశ్ చెప్పారు.
6/12

జ్యురిచ్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు బృందం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా లోకేశ్ టీషర్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
7/12

ఇక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలను చూస్తుంటే జ్యురిచ్‌లో ఉన్నామా..? లేక జువ్వలపాలెంలో ఉన్నామా.? అర్థం కావడం లేదని నవ్వుతూ చమత్కరించారు మంత్రి లోకేశ్.
8/12

సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయం తన జీవితంలో అత్యంత కష్టమైన సమయమని మంత్రి లోకేశ్ అన్నారు. ఆ టైంలోనూ ఆయన ప్రజల గురించే ఆలోచించారని చెప్పారు.
9/12

తెలుగు జాతి సత్తా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి చంద్రబాబు అని లోకేశ్ కొనియాడారు. ఆయన విజన్ 2020ను చాలా మంది ఎగతాళి చేశారని ఈనాడు అది నిజమైందని చెప్పారు.
10/12

సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తగా, రాజకీయ నేతగా అహర్నిశలూ శ్రమించారని లోకేశ్ అన్నారు. 3 సంస్థలు పెట్టి విఫలమైనా ఏమాత్ర అధైర్యపడకుండా హెరిటేజ్ సంస్థను స్థాపించారని పేర్కొన్నారు.
11/12

విదేశాల్లో తెలుగు వారంతా 'మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్' అని లోకేశ్ పేర్కొన్నారు. 'ఓమ్ క్యాప్' అనే సంస్థ ద్వారా మిడిల్ ఈస్ట్‌కు వెళ్లే తెలుగువారి అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
12/12

ఏపీ పునఃనిర్మాణం కోసం అంతా కలిసి పని చేయాలని తెలుగు పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. మీ సహకారం, తోడ్పాటు రాష్ట్రానికి అవసరమని అన్నారు. రానున్న ఐదేళ్లలో ఏపీ అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Published at : 20 Jan 2025 08:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion