Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP Desam
దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు విపరీత ఉష్ణోగ్రతల మధ్య జరుగుతోంది. అక్కడి వాతావరణం ప్రకారం ప్రస్తుతం -7 డిగ్రీల ఉష్ణోగ్రత దావోస్ లో ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి నారా లోకేశ్ కాలి నడకన ఎకనమిక్ ఫోరం సదస్సుకు నడుచుకుంటూ వెళ్లారు. ట్రాఫిక్ బాగా ఉండటంతో కారు కదల్లేని పరిస్థితుల్లో తన స్టాఫ్ తో కలిసి కాలి నడక ప్రారంభించిన లోకేశ్...నిర్ణీత సమయానికి సదస్సు జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. దావోస్ లో చలి ఉంటుంది కాబట్టి ఉండలేమన్న గత ప్రభుత్వ ఐటీ మంత్రి గుడి వాడ అమర్ నాథ్ కామెంట్స్ కు కౌంటర్ గా మంత్రికి ఉండాల్సిన డెడికేషన్ ఇదంటూ నారా లోకేశ్ వీడియోను వైరల్ చేస్తున్నారు టీడీపీ నాయకులు. కఠిన పరిస్థితుల్లో పనిచేస్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుందనే సీఎం చంద్రబాబు నాయుడు మాటలతోనే లోకేశ్ ఆ దిశలోనే ప్రయాణిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు, సోషల్ వారియర్స్ పోస్టుల కింద కామెంట్లు పెడుతున్నారు.





















