అన్వేషించండి

YS Jagan Politics: పార్టీ నేతలకే పరామర్శలు -ఎన్ని విషాదాలు జరిగినా పట్టించుకోని వైసీపీ అధినేత -ప్రజలపై అలిగారా?

YSRCP Chief: ఏపీలో ఘోర విషాదాలు జరిగినా జగన్ సోషల్ మీడియా ట్వీట్లకే పరిమితమవుతున్నారు. బాధితుల వద్దకు వెళ్లడం లేదు. ప్రతిపక్ష నేతగా ఆయన అడ్వాంటేజ్ తీసుకోవడం లేదు. ప్రజలపై అలిగారా?

Jagan is not showing much interest in consoling the people: గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా వెళ్లి బాధితుల్ని పరామర్శించేవారు. కానీ ఇప్పుడు ఆయన రూట్ మారిపోయింది. ఘోర విషాదాలు జరిగినా పట్టించుకోవడం లేదు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఓదార్చడానికి పెద్దగా   ఆసక్తి చూపించడం లేదు. పార్టీ నేతలు అరెస్టు అయితే  యాత్రగాతో వెళ్లి పరామర్శలు చేస్తున్నారు.  అదికూడా కొంత మంది కే. మిగిలిన వారిని ఇంటికి పిలిపిచుకుని ఓదారుస్తున్నారు. ఇక ప్రజాసమస్యలు.. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మాత్ర అసలు వెళ్లడం లేదు. ఈ నెలలో రెండు, మూడు ఘోర విషాదాలు ఏపీలో జరిగాయి. ఒకటి కల్తీ పాల విషాదం, రెండు బాణసంచా విషాదం. ఉత్తరాధ్రలో డయోరియా వల్ల కూడా కొంతమంది చనిపోయారు. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడుప్రతిపక్ష పార్టీలు హడావుడి చేస్తాయి. కానీ  జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోలేదు జగన్ పరామర్సలు చేస్తారని వైసీపీ వర్గాలు అనుకున్నా.. ఈ వారం ఆయన పెళ్లిళ్లకు మాత్రమే పరిమితమయ్యారు.  గత రెండేళ్లుగా జగన్ చేస్తున్నది ఇదే. 

రాజకీయ కారణాలపైనే ఎక్కువగా స్పందన 

వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్ రాజకీయం పూర్తిగా విజిటింగ్ ప్రొఫెసర్ తరహాలో జరుగుతోంది.  వారానికి మూడు, నాలుగు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్నారు.  బుధవారం వచ్చి శుక్రవారం బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. ఈ సమయంలో ఓ ప్రెస్మీట్ లేకపోతే పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా మాట్లాడి ఆ వీడియోలను విడుదల చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలు తక్కువ. ఓ సారి చిత్తూరులో మామిడి రైతులకు సంఘిభావం తెలిపేందుకు వెళ్లారు. ఆ తర్వాత పార్టీ నేతల ఇళ్లకు పరామర్శలకే వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలను ఎక్కువగా రాజకీయ కారణాలకే పరిమితం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

ప్రజలపై అలిగారా ? 

కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరించారన్న భావనలో జగన్ ఉన్నారని .. ఆ అసంతృప్తి ఆయనలో ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  అయితే జగన్ స్వయంగా తనకు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందని చెబుతూ ఉంటారు. ఆ కోణంలోనే   ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా, ఆయన కేవలం ప్రెస్ నోట్లు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కావడం పార్టీ క్యాడర్ ను అసంతృప్తికి గురి చేస్తోంది.  అయితే వైసీపీ పెద్దలు మాత్రం మరో విధంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైకాపా నాయకులపై కేసులు బనాయిస్తోందని, వారిని కాపాడుకోవడమే ప్రస్తుతానికి ప్రాధాన్యత అని జగన్ భావిస్తున్నట్లు  చెబుతున్నారు.  

చివరి రెండేళ్లు పాదయాత్రతో ప్రజల్లో ఉంటే చాలనుకుంటున్నారా? 
 
2019లో గెలిచిన దగ్గర నుండే జగన్ జనంతో నేరుగా మమేకం అవ్వడం తగ్గించారనే విమర్శలు ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగించడం రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒకప్పుడు ఓదార్పు యాత్ర పేరుతో ఊరూరా తిరిగిన జగన్, ఇప్పుడు అదే ప్రజలు కష్టాల్లో ఉంటే వెళ్లడానికి వెనకాడుతుండటం ఆయన ఇమేజ్‌ను దెబ్బతీస్తోంది. అయితే జగన్ మూడేళ్ల పాటు ప్రజా సమస్యలను పట్టించుకోకూడదని..చివరి రెండేళ్లు పాదయాత్ర చేస్తారు కాబట్టి అంతా కవర్ అయిపోతుదంని పార్టీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.  ప్రజలు ఆయన మూడేళ్లు ఏం చేశారన్నది మర్చిపోతారని. చివరి రెండేళ్ల పోరాటంతోనే ఓట్లేస్తారని అంటున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
AP Employee Unions: ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget