అన్వేషించండి

UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC: సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) - 2025 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం ( జనవరి 22) విడుదల చేసింది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.

Civil Services (Preliminary) Examination 2025: సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) - 2025 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)  జనవరి 22 (బుధవారం) విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్‌ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు. గతేడాది 1056 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకాగా.. ఈ ఏడాది 979 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. వీటిల్లో 38 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి గరిష్గంగా 6 సార్లు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఓబీసీ, దివ్యాంగులక 9 సార్లు అవకాశం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా పరీక్ష రాయడానికి అర్హులు.

వివరాలు..

* యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) ఎగ్జామ్ - 2025

ఖాళీల సంఖ్య: 979

సర్వీసులు:

➨ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్

➨ ఇండియన్ ఫారిన్ సర్వీస్

➨ ఇండియన్ పోలీస్ సర్వీస్

గ్రూప్-ఎ:

➨ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ 

➨ ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్

➨ ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్

➨ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్

➨ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్

➨ ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్

➨ ఇండియన్ పోస్టల్ సర్వీస్

➨ ఇండియన్ పోస్ట్ & టెలికమ్యూనికేషన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ 

➨ ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్(ట్రాఫిక్)

➨ ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్(పర్సనల్) 

➨ ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (అకౌంట్స్)

➨ ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్

➨ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ & ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్)

➨ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఇన్‌కం ట్యాక్స్) 

➨ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ (గ్రేడ్-3)

గ్రూప్-బి:

➨ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్-బి(సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్)

➨ ఢిల్లీ, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా &  నగర్ హవేలీ సివిల్ సర్వీస్, 

➨ ఢిల్లీ, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ పోలీస్ సర్వీస్

➨ పాండిచ్చేరి సివిల్ సర్వీస్

➨ పాండిచ్చేరి పోలీస్ సర్వీస్

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మెయిన్స్ పరీక్షల సమయానికి మాత్రం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.08.2025 నాటికి 21 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.08.1993 - 01.08.2004 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (బెంచ్ మార్క్ డిజబిలిటీస్), మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.

ఎంపిక విధానం: మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష విధానం..

✦ ప్రిలిమ్స్ పరీక్ష విధానం: 
మొత్తం 400 మార్కులకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.

✦ మెయిన్స్ పరీక్ష విధానం:
మొత్తం 1750 మార్కులకు యూపీఎస్సీ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 275 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) ఉంటుంది. ఇవి రెండు కలిపి 2025 మార్కులకు తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 250 మార్కులు కేటాయించారు. అయితే వీటిలో ఒక్కో పేపరుకు 300 మార్కుల చొప్పున క్వాలిఫయింగ్ పేపర్లు(పేపర్-ఎ, పేపర్-బి) ఉంటాయి. వీటి మార్కులను పరిగణనలోకి తీసుకోరు.  

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.01.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.02.2025. (6 PM)

➥ ప్రిలిమ్స్ పరీక్ష తేది: 25.05.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam attack: భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
Pahalgam Terror Attack: బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
Pahalgam Terror Attack : పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు?  పిరికిపందల పన్నాగం ఏంటీ?
పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు? పిరికిపందల పన్నాగం ఏంటీ?
Pahalgam Terror Attack: పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Navy Officer Vinay Narwal Pahalgam Terror Attack | హిమాన్షీ కన్నీటికి సమాధానం చెప్పేది ఎవరు.? | ABP DesamSRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam attack: భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
Pahalgam Terror Attack: బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
Pahalgam Terror Attack : పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు?  పిరికిపందల పన్నాగం ఏంటీ?
పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు? పిరికిపందల పన్నాగం ఏంటీ?
Pahalgam Terror Attack: పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
నీ పేరు నిలబెడతా..గర్వపడేలా చేస్తా..నేవీ అధికారి భార్య ఎమోషనల్
నీ పేరు నిలబెడతా..గర్వపడేలా చేస్తా..నేవీ అధికారి భార్య ఎమోషనల్
Pahalgam Terror Attack : ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ తీసుకున్న 5 నిర్ణయాలతో పాకిస్థాన్‌కు కలిగే నష్టమేంటీ?
ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ తీసుకున్న 5 నిర్ణయాలతో పాకిస్థాన్‌కు కలిగే నష్టమేంటీ?
Pahalgam Attack: వీళ్ల ఆచూకీ చెబితే 20 లక్షలు - జమ్ముకశ్మీర్ పోలీసుల కీలక ప్రకటన
వీళ్ల ఆచూకీ చెబితే 20 లక్షలు - జమ్ముకశ్మీర్ పోలీసుల కీలక ప్రకటన
Aghori : ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
Embed widget