అన్వేషించండి
Maha Kumbh 2025: మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసిన UAE సహా పది దేశాల ప్రతినిధులు
Maha Kumbh 2025: భారత ప్రభుత్వ ఆహ్వానంతో 10 దేశాల నుంచి 21 మంది సభ్యుల బృందం ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా ప్రాంతంలో పుణ్య స్నానం ఆచరించారు.

మహాకుంభ్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది
1/14

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు.
2/14

ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాకుంభ్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
3/14

ఇవాళ 10 దేశాలకు చెందిన 21 మంది సభ్యుల బృందం సంగమంలో పుణ్యస్నానం చేసింది.
4/14

భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఎక్స్‌టర్నల్ పబ్లిసిటీ అండ్ పబ్లిక్ డిప్లమసీ విభాగం వీళ్లను ఆహ్వానించింది.
5/14

10 దేశాల నుంచి 21 మంది సభ్యుల బృందం బుధవారం (జనవరి 15) ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంది.
6/14

ఉత్తరప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్మించిన ఆరైల్ ప్రాంతంలో ఉన్న టెంట్ సిటీలో బస చేశారు.
7/14

విదేశీయ ప్రతినిధుల బృందం మహాకుంభమేళా ప్రాంతంలో పర్యటించింది.
8/14

సాయంత్రం 5:00 నుంచి 6:30 గంటల వరకు నిర్వహించిన హెరిటేజ్ వాక్‌లో వీళ్లంతా పాల్గొన్నారు.
9/14

ప్రయాగ్‌రాజ్ సాంస్కృతిక, చారిత్రక వారసత్వ సంపద గురించి తెలుసుకున్నారు.
10/14

రాత్రి టెంట్ సిటీలో విందు ఆరగించి విశ్రాంతికి తీసుకున్నారు.
11/14

ఈ విదేశీ బృందం జనవరి 16, గురువారం ఉదయం 8:00 గంటలకు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసింది.
12/14

స్నానం ఆచరించిన తర్వాత అల్పాహారం తర్వాత 9:30 గంటలకు హెలికాప్టర్‌లో ట్రావెల్ చేసి మహాకుంభ్ ప్రాంతాన్ని విహంగ వీక్షణం చేశారు.
13/14

మధ్యాహ్నం 1:30 గంటలకు టూర్ ప్రోగ్రాం ముగించుకున్న ఈ బృందం విమానాశ్రయానికి బయల్దేరి వెళ్లి సొంత దేశానికి పయనమైంది.
14/14

ఫిజీ, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్ అండ్ టొబాగో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రతినిధులు ఈ టీంలో ఉన్నారు.
Published at : 16 Jan 2025 06:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
టీవీ
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion