Dhoni DRS Fail : డీఆరెస్ లో ధోనీ ఫెయిల్.. షాక్ లో అభిమానులు.. సోషల్ మీడియాలో చర్చ
క్రికెట్లో ధోనీకి ఉన్న క్రేజ్ తెలిసిందే. బ్యాటర్ గా విధ్వంసకరంగా ఆడటంతోపాటు , కీపర్ గా అద్భుతమైన క్యాచ్ లు, మెరుపు స్టంపింగ్ లతో ప్రసిద్ధి కెక్కాడు. ఇక డీఆరెస్ విషయంలో తనది నెక్ట్స్ లెవల్.

IPL 2025 RCB VS CSK Live Updates: డీఆర్ ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్. అయితే ధోనీ ఫ్యాన్స్ మాత్రం ఈ అర్థాన్నే మార్చేశారు. ధోనీ రివ్యూ సిస్టమ్ అని నామకరణం చేశారు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ధోనీ డీఆరెస్ తీసుకున్నాడంటే అది కచ్చితంగా సఫలం అవుతందని ఒక నమ్మకం ఉంది. గతంలోనూ ఎన్నోసార్లు ఇది ప్రూవ్ అయింది. నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన తొలి మ్యాచ్ లోనూ ధోనీ రివ్యూ తీసుకోవడం, అది సఫలం కావడంతో ఈ నమ్మకం మరింతగా బలపడింది. అయితే శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో మాత్రం ధోనీకి షాక్ ఎదురైంది. ఎంతో కచ్చితత్వంతో డీఆరెస్ తీసుకునే ధోనీ మాత్రం చాలా అరుదుగా ఫెయిలయ్యాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎల్బీ కోసం ధోనీ అప్పీల్ చేశాడు. అయితే రివ్యూలో కోహ్లీ నాటౌట్ గా నిలిచాడు. తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరలైంది. అభిమానులు తమకు తోచిన కామెంట్లు చేస్తూ, లైకులు, షేర్లతో పోస్టులను హోరెత్తిస్తున్నారు.
Dhoni review system 🤭🤭🤭🤭🤭 pic.twitter.com/eIHN9Dp9fb
— Kαииαи (@craigthebond) March 28, 2025
ఇంతకీ ఏమైందంటే..?
ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఖలీల్ అహ్మద్ వేసిన బంతి నేరుగా వచ్చి కోహ్లీ ప్యాడ్లను ముద్దాడింది. దీంతో ఖలీల్ గట్టిగా అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. దీనిపై కాసేపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో చర్చించిన ధోనీ, నేరుగా రివ్యూ తీసుకున్నాడు. అయితే రిప్లేలో బంతి లెగ్ సైడ్ అవతల పిచ్ కావడంతో కోహ్లీ నాటౌట్ గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 196 పరుగులు చేసింది. రజత్ పతిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 51, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)తో సత్తా చాటాడు.
బౌలింగ్ కే మొగ్గు చూపిన ఇరు జట్లు..
ఇక చెన్నైలో ఉన్న పరిస్థితులను బట్టి, ఇరుజట్లు బౌలింగ్ కే మొగ్గు చూపాయి. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో డ్యూ ఉంటుంది కాబట్టి, టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నామని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ చెప్పాడు, రెండో ఇన్నింగ్స్ లో డ్యూ కారణంగా బ్యాటింగ్ కొంచెం ఈజీగా ఉంటుందని విశ్లేషించాడు. మరోవైపు తాము టాస్ గెలిచినా బౌలింగే తీసుకునేవాళ్లమని పతిదార్ చెప్పాడు. సెకండ్ హాఫ్ లో డ్యూను కంట్రోల్ చేసే విధానంపైనే మ్యాచ్ గెలుపు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ సీజన్లో ఇరుజట్లు తొలి మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేశాయి. తొలి మ్యాచ్ లో కేకేఆర్ పై ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ పై సీఎస్కే గెలిచాయి. ఇక చెన్నైలో ఈసారి గెలవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. 2008 తొలి సీజన్ లో మాత్రమే ఆర్సీబీ ఇక్కడ గెలిచింది. ఆ తర్వాత గత 16 ఏళ్లుగా ఇక్కడ బెంగళూరుకు గెలుపు అందని ద్రాక్షే అయింది.




















