Jewel Thief OTT Release Date: నేరుగా ఓటీటీలోకి సైఫ్ అలీఖాన్ థ్రిల్లర్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Jewel Thief OTT Platform: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'జ్యుయెల్ థీఫ్'. ఈ మూవీ నేరుగా 'నెట్ ఫ్లిక్స్'లో ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Saif Ali Khan's Jewel Thief OTT Release On Netflix: థ్రిల్లర్, కామెడీ, హారర్, క్రైమ్ ఇలా జోనర్ ఏదైనా ఓటీటీ ఆడియన్స్ కోసం ఆసక్తికర కంటెంట్‌ను ఓటీటీలు అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్ కొనసాగుతోన్న క్రమంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా, మరో థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఆ ఓటీటీలోకి హైస్ట్ థ్రిల్లర్
థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారి కోసం మరో హైస్ట్ థ్రిల్లర్ ఓటీటీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'జ్యుయెల్ థీఫ్' (Jewel Thief). డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ సమర్పణలో.. కూకీ గులాటి, రాబీ గ్రేవాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 25 నుంచి నేరుగా 'నెట్ ఫ్లిక్స్' (Netflix) ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది.
ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. 'రిస్క్ ఎంత పెద్దదైతే అంత పెద్ద చోరీ జరుగుతుంది. అద్భుతమైన జ్యుయెల్ థీఫ్ వచ్చేస్తున్నాడు.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వార్, పఠాన్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మూవీలో జైదీప్ అహ్లావత్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
The bigger the risk, the sweeter the steal. Aa raha hai the incredible- Jewel Thief ✨💎
— Netflix India (@NetflixIndia) March 28, 2025
Watch Jewel Thief, out 25 April, only on Netflix. #JewelThiefOnNetflix pic.twitter.com/GfzVEtIszz
రూ.500 కోట్ల విలువైన డైమండ్ చుట్టూ..
ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ఓ మోసగాడి పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. జైదీప్ అహ్లావత్ ఓ మాఫియా డాన్ పాత్ర పోషిస్తున్నాడు. ఖరీదైన వజ్రాలు చోరీ నేపథ్యంలో ఈ స్టోరీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రూ.500 కోట్ల విలువైన డైమండ్‌ను చోరీ చేయాలని విలన్.. హీరోకి పని అప్పచెప్పగా ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ. దీంతో ఓటీటీ లవర్స్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






















