Charith Balappa Arrested: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
Actor Charith Balappa: లైంగిక వేధింపుల కేసులో టీవీ నటుడు అరెస్ట్ అయిన ఘటన ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఎక్కడ అరెస్ట్ చేశారు? వంటి వివరాల్లోకి వెళితే
చరిత్ బాలప్ప... తెలుగు బుల్లితెర వీక్షకులకు సైతం సుపరిచితుడు. అయితే... అతను తెలుగు వ్యక్తి కాదు, కన్నడిగ. కన్నడ సీరియళ్లతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆ అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. చరిత్ బాలప్పను ఎందుకు అరెస్ట్ చేశారు? వంటి వివరాల్లోకి వెళితే...
చరిత్ మీద కంప్లైంట్ చేసిన గర్ల్ ఫ్రెండ్!
చరిత్ బాలప్ప తనను లైంగికంగా వేధించారని ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో ఆయన్ను బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ, ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా? చరిత్ బాలప్ప గర్ల్ ఫ్రెండ్.
తనను లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్ మెయిల్ చేశాడని చరిత్ బాలప్ప మీద అతని గర్ల్ ఫ్రెండ్ ఆరోపణలు చేసింది. అంతే కాదు... లైంగిక దాడి మాత్రమే కాదు, తన దగ్గర డబ్బులు సైతం దోచుకున్నాడని ఆ అమ్మాయి ఆరోపణలు చేసింది. గర్ల్ ఫ్రెండ్ ప్రయివేట్ ఫోటోలు, వీడియోలు అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చరిత్ బాలప్ప మీద ఆవిడ ఆరోపణలు చేసింది.
ఇంతకు ముందు కూడా చరిత్ మీద కంప్లైంట్!
చరిత్ బాలప్ప మీద కంప్లైంట్ రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గత ఏడాది జూన్ నెలలో అతని మీద మాజీ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నటి మంజు శ్రీతో 2017లో చరిత్ బాలప్పకు వివాహం అయ్యింది. ఐదేళ్ల సంసార జీవితం తర్వాత వాళ్లిద్దరి కాపురంలో కలహాలు చోటు చేసుకున్నాయి. దాంతో 2022లో విడాకులు తీసుకున్నారు.
Also Read: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్... ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?
కోర్టు తీర్పును అనుసరించి భరణం ఇవ్వవలసిందిగా లీగల్ నోటీసు పంపిన తర్వాత తనపై చరిత్ బాలప్ప బెదిరింపులకు పాల్పడినట్లు మంజు శ్రీ కంప్లైంట్ చేశారు. ఆ కేసు కూడా బెంగళూరులోని సర్జాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యింది. ఇప్పుడు మరో కేసు చరిత్ మీద వచ్చింది. దాంతో అతని వ్యవహార శైలి టీవీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
Also Read: జీసస్‌తో పాటు గణేశుడికీ పూజలు... సమంత ఇంట్లో హిందూ దేవుళ్లు
View this post on Instagram