Samantha: జీసస్‌తో పాటు గణేశుడికీ పూజలు... సమంత ఇంట్లో హిందూ దేవుళ్లు
Samantha Turns Devotional: సమంత మోడ్రన్ మహిళ అయినప్పటికీ... ట్రెడిషన్స్ కూడా ఫాలో అవుతారు. ఆవిడ క్రిస్టియన్ అయినప్పటికీ... హిందూ దేవుళ్లకు పూజలు చేస్తారు.
సమంతను చూస్తే పూజలో పునస్కారాలు చేసే అమ్మాయిగా అసలు కనిపించరు. ఆవిడ మోడరన్ మహిళ. పైగా పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న స్టార్ హీరోయిన్. అటువంటి మహిళ పూజలు గట్రా చేస్తారని ఎవరు అనుకుంటారు? అసలు నిజం ఏమిటంటే... సమంత చాలా డివోషనల్!
ఏసు ప్రభువుతో పాటు గణేశుడికి పూజలు
ప్రజెంట్ సమంత హాలిడే మూడ్ లో ఉన్నారు. ఇయర్ ఎండ్ కదా... బాగా చిల్ అవుతున్నట్టు ఉన్నారు. బెడ్ మీద బ్లాంకెట్ కప్పుకొని ఉన్న ఫోటోలను ఆవిడ షేర్ చేశారు. జాగ్రత్తగా గమనిస్తే... ఆయా ఫోటోల్లో వినాయకుడితో పాటు దుర్గామాత కూడా ఉన్నారు.
జన్మతః సమంత క్రిస్టియన్. ఆ విషయం అందరికీ తెలుసు. అందులో దాపరికాలు గట్రా ఏమీ లేవు. అయితే... ఏసు క్రీస్తుతో పాటు హిందూ దేవుళ్లకు కూడా సమంత పూజలు చేస్తుంటారు. హిందూ ట్రెడిషన్స్ కూడా ఆవిడ ఫాలో అవుతూ ఉంటారు. క్రిస్మస్ సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెడతారు. సమంత ఇంట్లో కూడా సేమ్. క్రిస్మస్ సమయంలో గణేషుడికి కూడా ధూప దీపాలతో సమంత పూజ చేశారు. అది విశేషం. అలాగే దుర్గామాత ఫోటోలను కూడా సమంత షేర్ చేశారు.
Also Read: 'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?
View this post on Instagram
కోయంబత్తూరులోని ఇషా యోగ సెంటర్ కు తరచూ సమంత వెళతారు. ధ్యానం చేస్తారు. మోడ్రన్ దుస్తులు ధరించినప్పటికీ... సమంతలో ఇండియన్ ట్రెడిషన్ అలాగే ఉంది. ఆ విషయంలో ఆవిడను అందరూ ఫాలో అవ్వచ్చు.
ప్రస్తుతం సమంత నటిస్తున్న ప్రాజెక్టులు ఏమిటి?
Samantha Upcoming Movies: పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి సమంత ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే... ప్రస్తుతం ఆవిడ రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. అది కాకుండా తెలుగు తమిళ భాషల్లో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మరి వాటిని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.
Also Read: బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?