అన్వేషించండి

Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!

Hosur Airport: తమిళనాడులోని హోసూర్ విమానాశ్రయానికి అనుమతులు నిరాకరించడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

Criticism against Chandrababu Naidu in Tamil Nadu: తమిళనాడులోని  హోసూర్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతి నిరాకరించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ పరిణామాన్ని కొందరు తమిళ నెటిజన్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ముడిపెడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన  కుప్పంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారని, దానికి పోటీగా మారుతుందనే ఉద్దేశంతోనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హోసూర్ ప్రాజెక్టును అడ్డుకున్నారని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. గతంలో వైజాగ్, విజయవాడ సర్వీసుల ఉదాహరణలను చూపుతూ, ఆశించిన స్థాయిలో ప్రయాణికులు లేకున్నా కుప్పంలో ఎయిర్‌పోర్ట్ అవసరమా అంటూ విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ఏవియేషన్ మంత్రి కూడా టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు కావడంతో లింక్ పెడుతున్నారు. కానీ అనుమతులు తిరస్కరించింది రక్షణ శాఖ. 

వాస్తవానికి, హోసూర్ ఎయిర్‌పోర్టుకు అనుమతి నిరాకరించడానికి గల కారణాలు పూర్తిగా సాంకేతికమైనవి. హోసూర్ ప్రాంతంలోని గగనతలం  ప్రస్తుతం  హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్  నియంత్రణలో ఉంది. రక్షణ రంగ కార్యకలాపాలు, శిక్షణ , భద్రతా అవసరాల దృష్ట్యా ఈ ప్రాంతంలో పౌర విమానయానానికి అవకాశం లేదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. గతంలోనూ ఇదే కారణంతో ప్రతిపాదనలు తిరస్కరణకు గురయ్యాయి. ఇది కేంద్ర రక్షణ శాఖ తీసుకున్న స్వతంత్ర నిర్ణయం తప్ప, ఇందులో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర ఉండే అవకాశం లేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

అంతేకాకుండా, హోసూర్ ఎయిర్‌పోర్ట్ నిలిచిపోవడానికి  పరంధూరు విమానాశ్రయ వివాదం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. పరంధూరు వద్ద రెండో విమానాశ్రయం ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను అక్కడి స్థానిక రైతులు దాదాపు 900 రోజులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమయంలోనే హోసూర్ వంటి ప్రత్యామ్నాయాలపై చర్చ జరుగుతున్నా, రక్షణ శాఖ భద్రతా కారణాలనే ప్రధానంగా ప్రస్తావిస్తోంది. కానీ, కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం లేదా అవగాహన లేమితో కుప్పం విమానాశ్రయంతో దీనికి లంకె పెడుతూ తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు.         

కుప్పం ఎయిర్‌పోర్ట్ అనేది ప్రధానంగా  అగ్రికల్చరల్ ఎక్స్‌పోర్ట్ హబ్ వ్యవసాయ ఎగుమతుల కేంద్రం గా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు వేర్వేరు లక్ష్యాలతో, వేర్వేరు భౌగోళిక ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత లభిస్తోంది. రక్షణ శాఖ అనుమతులు నిరాకరించడం వెనుక ఉన్న వాస్తవాలను పక్కనబెట్టి, వ్యూహాత్మకంగా చంద్రబాబుపై చేస్తున్న ఈ దుష్ప్రచారం ఇప్పుడు తెలుగు, తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.  

 

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget