ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఫోన్లలో ఒకటిగా పేరుతెచ్చుకుంది వెర్ట్యూ

Published by: Raja Sekhar Allu

వెర్ట్యూ కంపెనీని 1998లో ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా ప్రారంభించింది. రోలెక్స్ వాచీల్లాగా ఒక విలాసవంతమైన ఆభరణంగా మార్చాలని ప్లాన్.

Published by: Raja Sekhar Allu

ఇవి ఫ్యాక్టరీలలో రోబోల ద్వారా తయారయ్యేవి కావు. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు చేత్తో ఒక్కో ఫోన్‌ను అసెంబుల్ చేస్తారు.

Published by: Raja Sekhar Allu

ఏ వ్యక్తి అయితే పూర్తిగా తయారు చేస్తారో, ఆ వ్యక్తి సంతకం ఆ ఫోన్ వెనుక లేదా బ్యాటరీ కింద ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

ఈ ఫోన్ల తయారీలో టైటానియం, ప్లాటినం, 18 క్యారెట్ల బంగారం వంటి విలువైన లోహాలను వాడతారు.

Published by: Raja Sekhar Allu

ఫోన్ వెనుక భాగంలో మొసలి చర్మం లేదా పాము చర్మం వంటి ఎంతో ఖరీదైన లెదర్‌ను ఉపయోగిస్తారు.

Published by: Raja Sekhar Allu

వెర్ట్యూ ఫోన్లలో ఉండే ప్రతి కీ కింద రూబీ బేరింగ్‌లను ఉపయోగిస్తారు.

Published by: Raja Sekhar Allu

వీటి స్క్రీన్‌లను జ్రం తర్వాత ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పదార్థం. సింథటిక్ సఫైర్ క్రిస్టల్ తో తయారు చేస్తారు. కత్తితో గీసినా గీతలు పడవు.

Published by: Raja Sekhar Allu

వెర్ట్యూ ఫోన్ పక్కన ఒక ప్రత్యేక బటన్ ఉంటుంది. దీన్ని నొక్కితే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా 24/7 పర్సనల్ అసిస్టెంట్‌తో మాట్లాడవచ్చు.

Published by: Raja Sekhar Allu

వెర్ట్యూ ఫోన్లలో 'సిగ్నేచర్ కోబ్రా' మోడల్ అత్యంత ఖరీదైనది. దీని ధర సుమారు రూ. 2.3 కోట్ల నుంచి రూ. 4.5 కోట్ల వరకు ఉంటుంది.

Published by: Raja Sekhar Allu