అన్వేషించండి

Brahmamudi serial today episode march 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుగా మారిపోయిన రాజ్‌ - ఇందుగా మారిపోయిన కావ్య

Brahmamudi serial today episode march 4th: ఇందు, రాజులు పెరిగి పెద్ద వారవుతారు. ఇందు ఇంట్లో పనిమనిషిలా మారిపోతుంది. రాజు జులాయిగా మారిపోతాడు.

Brahmamudi Serial Today Episode: స్టడీ టేబుల్‌ దగ్గర కూర్చుని చదువుకుంటూనే నిద్రపోతుంటుంది స్వాతి. ఇంతలో సూప్‌ తీసుకుని స్వాతి దగ్గరకు వస్తుంది ఇందు. నిద్రపోతున్న స్వాతిని నిద్రలేపి సూప్‌ ఇస్తుంది. 
స్వాతి: నాకేం వద్దు నువ్వే తాగు..
ఇందు: ఎందుకంత కోపం లేట్‌ అయిందా..?
స్వాతి: ఒక రౌండ్‌ నిద్ర కూడా అయింది.
ఇందు: అంటే సిలబస్‌ కంప్లీట్‌ అవ్వలేదా..? 
స్వాతి: అక్కా ఆగు.. సిలబస్‌ కంప్లీట్‌ చేయాల్సింది నువ్వు ఈరోజు నీకు ఎగ్జామ్ ఉందన్న విషయం గుర్తుందా..? 
ఇందు: గుర్తుంది.. ఎప్పుడో చదివేశాను.. ఇప్పుడు రివిజన్‌ చేసుకుంటున్నాను 
స్వాతి: ఇయర్‌బర్డ్‌ తో రివిజనా..? అది ఎలా 
ఇందు: సింపుల్‌ రాత్రి చదువుతూ రికార్డు చేసుకున్నా ఇప్పుడు అదే వింటున్నాను
స్వాతి: ఇంట్లో వాళ్లు నిన్ను వాడేసుకుంటుంటే.. నువ్వు టెక్నాలజీని వాడేసుకుంటున్నావు అన్నమాట 
ఇందు: హలో స్వాతి వాళ్లు నన్ను బిజీగా ఉంచొచ్చు.. కానీ నా బ్రెయిన్‌ను కాదు.
స్వాతి: అవును అక్కా నువ్వు ఇంత సీక్రెట్‌గా డిగ్రీ వరకు వచ్చేశావని రేఖ ఆంటీకి తెలిస్తే..?
ఇందు: తెలిస్తే నీ వల్లే తెలియాలి 
స్వాతి: అయితే నేను విలన్ అన్నమాట..
ఇందు: కాదు నువ్వే నా సేప్టీ లాకర్‌ వి 
స్వాతి: అయితే నీ రహస్యాలన్నీ నా లాకర్‌లో దాచేసుకో
ఇందు: అయితే జాగ్రత్త మరి ఆ దొంగలకు ముందు కనిపించేది ఈ సేప్టీ లాకరే.
స్వాతి: అమ్మో అయితే వద్దులే అక్కా కొన్ని రహస్యాలు చాలులే.. 
బయటి నుంచి భ్రమరాంభ ఓసేయ్‌ ఇందు జ్యూస్‌ అంటూ కేకలేస్తుంది. 
ఇందు భయంగా వెళ్లిపోతుంది. భ్రమరాంబకు జ్యూస్‌ ఇచ్చి అపర్ణ కాఫీ, సుభాష్ కు సూప్‌ తీసుకెళ్లి ఇస్తుంది. 
అపర్ణ: అయిపోయిందా..? అందరికీ చాకిరి చేయడం.. 
ఇందు: అప్పుడేనా..? ఇంకా ఐశ్వర్యను నిద్ర లేపాలి. రేఖ ఆంటీకి కాఫీ పంపించాలి. అందరికి టిఫిన్‌ చేయాలి 
అపర్ణ: ఈ రోజు ఆ పనులు నేను చేస్తానంటే ఒప్పుకోకుండా నువ్వే చేసుకుంటున్నావు.. అసలు నీకు ఈరోజు ఎగ్జామ్‌ ఉందన్న విషయం గుర్తుందా..? 
ఇందు: ఆ సంగతి నేను చూసుకుంటానులే అపర్ణాదేవి.. సుబ్బు వేడి వేడిగా సూప్‌ తెచ్చాను అవతల నాకు చాలా పనులు ఉన్నాయి..
సుభాష్‌: చదువుకుంటున్నానని గర్వంగా చెప్పుకోవాల్సిన విషయాన్ని ఇలా దొంగతనంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ఈ తాతయ్య నీకు ఏ సహాయం చేయలేకపోతున్నాడు.. నన్ను క్షమించు అమ్మ 
ఇందు: ఇప్పుడు అంతగా నేను ఏం బాధపడుతున్నాను చెప్పు 
అపర్ణ:  నీ ఇంట్లోనే నువ్వు బాధపడుతున్నావు అది నీకు బాధ కలిగించడం లేదా..?

ఇందు: అపర్ణాదేవి… మా అమ్మా నాన్నలు నన్ను ప్రాణాలకు తెగించి కాపాడింది ఇలా ఏడుస్తూ కూర్చోవడానికి కాదు.. జీవితంలో గెలవడానికి ఏదో ఒకరోజు మా అమ్మ ఆశలను మా నాన్న ఆశయాలను నిలబెడతాను. అవసరం అయితే దానికోసం ఈ ప్రపంచంతోనే యుద్దం చేస్తాను. ఆ రేఖ ఎలాంటిది అయినా తను ఏం చేసినా ఎదిరించడానికి నేను సిద్దంగా ఉన్నాను.. కాలంలో కరిగిపోయిన ఆ బంధాన్ని నేను తీసుకురాకపోవచ్చు.. కానీ దూరం అయిన సంతోషాన్ని తీసుకొస్తాను. కోల్పోయిన మన స్వేచ్చను.. దూరం అయిన దుగ్గిరాల ఇంటి పేరును తిరిగి సంపాదిస్తాను. అజ్ఞాతవాసంతో పాండవులు అడవిపాలు కావొచ్చు.. విరాట కొలువులో అవమానం జరిగి ఉండొచ్చు.. కానీ వీటన్నింటిని తిరిగి ఇవ్వడానికి ఆ రోజు నా కృష్ణయ్యే కురుక్షేత్రాన్ని నడిపించినట్లుగా త్వరలోనే నా చేత ఈ యుద్దాన్ని కూడా నడిపిస్తాడు.. 

అపర్ణ: నిన్ను చూస్తుంటే.. మీ అమ్మ లాగే ఉన్నావు.. అది కూడా ఇలాగే కష్టం వస్తే బాధపడటం కాదు ఎదురించి నిలబడాలి పోరాడాలి అంటూ చెప్పేది
అంటూ అపర్ణ చెప్తుంటే.. సరే నాకు టైం అవుతుంది. వెళ్తాను అంటూ ఇందు వెళ్లిపోతుంది. మరోవైపు రాజు పెద్దవాడై పగటి  కలలు కంటుంటాడు. వాళ్ల నాన్న వచ్చి తన్ని నిద్ర లేపి వాటర్‌ తీసుకురమ్మని చెప్తాడు. వాటర్‌ ట్యాంక్‌ దగ్గరకు వెళ్లిన రాజు అక్కడి ఆడవాళ్లతో నీళ్ల కోసం గొడవ పెట్టుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today June 27th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని కఠినంగా శిక్షించమని కన్న తల్లి చెప్పడానికి కారణమేంటి? జ్యోత్స్నకి దీప అంటే చాలా ఇష్టమా.. ఇదేం ట్విస్టూ!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని కఠినంగా శిక్షించమని కన్న తల్లి చెప్పడానికి కారణమేంటి? జ్యోత్స్నకి దీప అంటే చాలా ఇష్టమా.. ఇదేం ట్విస్టూ!
Nindu Manasulu Serial Today June 27th: నిండు మనసులు: గణని కాపాడమని తండ్రి కాళ్లు పట్టుకున్న సాహితి! సిద్ధూ, విజయానంద్ ఏం చేయనున్నారు?
నిండు మనసులు: గణని కాపాడమని తండ్రి కాళ్లు పట్టుకున్న సాహితి! సిద్ధూ, విజయానంద్ ఏం చేయనున్నారు?
Nuvvu leka Neanu Lenu Serial Today June 27th: విక్కీ గుండెలపై వాలిపోయిన రాధ...భర్తతో కలిసి ఇంటికి రావడంతో దమయంతి షాక్‌
నువ్వులేక నేను లేను: విక్కీ గుండెలపై వాలిపోయిన రాధ...భర్తతో కలిసి ఇంటికి రావడంతో దమయంతి షాక్‌
Illu Illalu Pillalu Serial Today June 27th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మదని లాగిపెట్టి కొట్టిన వేదవతి! వెనకేసుకొచ్చిన వల్లీ! కిలాడీ డ్రైవర్‌ని ధీరజ్ కనిపెడతాడా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మదని లాగిపెట్టి కొట్టిన వేదవతి! వెనకేసుకొచ్చిన వల్లీ! కిలాడీ డ్రైవర్‌ని ధీరజ్ కనిపెడతాడా!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
K Bhagyaraj: కోలీవుడ్‌లో విషాదం... సీనియర్ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి
కోలీవుడ్‌లో విషాదం... సీనియర్ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి
Gade Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
How to Prove Indian Citizenship: ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Weekly Horoscope: 28 జూన్ - 4 జూలై వారఫలాలు! మేషం నుంచి కన్య వరకు మీ అదృష్టం!
28 జూన్ - 4 జూలై వారఫలాలు! మేషం నుంచి కన్య వరకు మీ అదృష్టం!
Bangles History: మహిళలు చేతులకు గాజులు ధరించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? భారతీయ సంస్కృతిలో వాటి లోతైన చరిత్ర!
మహిళలు చేతులకు గాజులు ధరించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? భారతీయ సంస్కృతిలో వాటి లోతైన చరిత్ర!
Bhavana Lasya: బుల్లితెరపై రాణిస్తోన్న తెలుగు ముద్దుగుమ్మ.. ఫస్ట్ సీరియల్‌తోనే టైటిల్ రోల్.. భావనా లాస్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై రాణిస్తోన్న తెలుగు ముద్దుగుమ్మ.. ఫస్ట్ సీరియల్‌తోనే టైటిల్ రోల్.. భావనా లాస్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Embed widget