అన్వేషించండి

Brahmamudi Serial Today February 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణను బెదిరించిన రేఖ – అయోమయంలో అపర్ణ

Brahmamudi serial today episode February 28th: ఆస్థి మొత్తం తన పేరు మీద రాయాలని రేఖ, అపర్ణను బెదిరిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: అపర్ణ, సుభాష్‌ ఇంట్లో కూర్చుని ఎవ్వరూ లేకుండా అయిపోయింది ఇల్లు అంటూ బాధపడుతుంటే అప్పుడే రేఖ పెళ్లి చేసుకుని వచ్చి డోర్‌ దగ్గర నిలబడి నేనున్నాను కదా అత్తయ్యా అంటూ చెప్తుంది. రేఖను చూడగానే.. అపర్ణ, సుభాష్‌ షాక్‌ అవుతారు. రేఖ ఇంట్లోంకి అడుగుపెడుతుంటే.. అపర్ణ కోపంగా చూస్తుంది.

అపర్ణ: ఆగు.. మళ్లీ ఎందుకు వచ్చావు నువ్వు.. నీ ముఖం కూడా నాకు చూపించకు అని చెప్పాను కదా..? అడుగు లోపల పడిందంటే నిన్ను చంపేస్తాను (రేఖ లోపలికి వస్తుంది.)  ఏంత ధైర్యం ఉంటే నువ్వు నా మాట వినకుండా లోపలికి వస్తావు

రేఖ: ఆవేశపడకండి ఆంటీ నువ్వు విషయం బాగా అర్థం చేసుకోవాలి. పవర్‌లో లేని పొలిటీషియన్‌కు ఫామ్‌లో లేని క్రికెటర్‌కు అన్ని కోల్పోయిన నీలాంటి ఇంటి పెద్ద చెప్పిన మాటకు ఎటువంటి విలువ ఉండదు. ఇప్పుడు నీలాంటి వాళ్ల మాటలకు ఎవ్వరూ భయపడరు.. అలాంటప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు ఒక్కదానివే ఎలా పాలించగలవు.. పెళ్లి చేసుకుని మంది మార్భాలంతో వచ్చాను

అపర్ణ: ఎందుకు అడుక్కుతినడానికా…?

రేఖ: వదిన పవర్‌ పోయినా పొగరు మాత్రం తగ్గలేదు ఆంటీకి

రేఖ వాళ్ల వదిన:  అదెంత పని రేఖ నువ్వు అనుకుంటే చిటికెలో తగ్గించొచ్చు

రేఖ: చూడండి ఆంటీ ఈ దుగ్గిరాల ప్రాపర్టీని చూసుకోవడం మీ వల్ల కాదు.. వాటన్నింటిని  నాచేతుల్లో పెట్టండి కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను..

అపర్ణ: ఏంటి బెదిరిస్తున్నావా..? నువ్వు తలుచుకుంటే ఈ ఇంటి ముందు మొలిచిన గడ్డి పోచను కూడా పీకలేవు.. కానీ నేను అనుకుంటే నిన్ను జీవితాంతం జైలులో కూర్చోబెట్టి చిప్పకూడు తినేలా చేయగలను..

రేఖ:  చాలా కోరికలు ఉన్నాయి ఆంటీ నేను ఎవరో ఏంటో మర్చిపోతున్నావా..? ఒక్కసారి నీ కొడుకును చంపిన మా అమ్మను గుర్తు చేసుకో..

సుభాష్‌: రేఖ…

రేఖ: ఏంటి అంకుల్‌ మీతో కూడా మాట్లాడతాను ఉండండి.. ఆంటీతో మాట్లాడుతున్నాను కదా..? ఒక్క నిమిషం వస్తాను మీదాకా..? గుర్తొచ్చిందా ఆంటీ నీ కొడుకు తలను పగలగొట్టి తన ప్రాణాలను పంచభూతాల్లో కలిపేసిన నా తల్లి గుర్తొచ్చిందా..? మా అమ్మే అంత చేసినప్పుడు తన రక్తాన్ని పంచుకుని పుట్టినదాన్ని నేనెంత చేయగలను. ఆ మాత్రం ఊహించలేవా..? కళ్ల ముందు కుటుంబం కాలిపోతున్నా.. చూస్తూ బతకగలిగావు.. కొడుకు, కోడలు ప్రాణాలు వదిలేస్తున్నా.. భరించగలిగావు.. మరి అదే కళ్ల ముందు నీ వారసురాళ్లను చంపేస్తుంటే.. ఇలాగే చూస్తూ నిలబడగలవా..?

అంటుండగానే.. రేఖ భర్త చిన్న పిల్లలను చంపబోతాడు.

అపర్ణ: రేఖ ఏం చేస్తున్నావు..?

రేఖ: మనవరాళ్ల మెడ మీద కత్తి పెట్టగానే.. మీ గుండెల్లో కత్తి దించినట్టుగా ఉందా..? కానీ నాకు అది సరిపోదు ఆంటీ.. ఇంకా ఇంకా కావాలి..

అనగానే వాళ్ల వదిన కర్రతో సుభాష్‌ను కొడుతుంది. సుభాష్‌ కింద పడిపోతాడు. అపర్ణ: ఏయ్‌ నువ్వు అసలు మనిషివేనా…?

రేఖ: కాదు రాక్షసిని రెండు చిటికెలు వేయగానే.. నీ గుండెలు జారి చేతుల్లోకి వచ్చినట్టు ఉంది. మరి నా తల్లిని చంపిన మిమ్మల్ని ఎలా వదిలేస్తాను.. ఏడ్చింది చాలు కానీ నీతో చాలా పనుంది. నేను ఏం చేయగలనో.. ఇప్పటికే నీకు బాగా అర్థ అయింది అనుకుంటా నా మాటకు ఎదురు చెప్పకుండా వచ్చి ఈ పేపర్స్‌ మీద సంతకం చేయ్‌

అపర్ణ: ఏంటా పేపర్స్‌..?

రేఖ: ఆస్థి పేపర్లు నువ్వు సంతకం చేయగానే.. ఆస్థి మొత్తం నా పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

అపర్ణ: నేను సంతకం చేస్తే ఆస్థి కాదు కదా..? ఈ ఇంట్లో ఆవగింజ కూడా రాదు.. అర్థం కాలేదా..? ఆస్థి మొత్తం కావ్య పేరు మీద ఉంది. కావ్య చనిపోయింది కాబట్టి ఇందు చిన్న పాప కాబట్టి తనకు పాతికేళ్లు వచ్చే వరకు తనకు కూడా ఎటువంటి అధికారం ఉండదు.. అప్పటి వరకు నేను ఒక గార్డియన్‌గా ఉంటాను. కాదు కూడదు అని నువ్వేమైనా వేషాలు వేస్తే.. ఆస్థి మొత్తం దుగ్గిరాల ట్రస్ట్‌కు వెళ్లిపోతుంది. ఏంటి అర్తం కాలేదా..? చుట్టూ మీ అమ్మ గుంతనక్కలా తిరుగుతుందని తెలిసి నా కొడుకు కోడలు ముందే ఊహించి  అంత పకడ్దందీగా డాక్యుమెంట్స్‌ రెడీ చేశారు. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు..

అనగానే.. రేఖ కోపంగా అపర్ణను కొట్టి ఆస్థికి గార్డియన్‌గా తన పేరు రాయించుకుంటుంది. మరోవైపు స్వరాజ్‌కు గతం గుర్తుకు వచ్చేలా డాక్టర్‌ ప్రయత్నిస్తుంటాడు. తర్వాత అపర్ణ, సుభాష్‌ ఇద్దరూ బాధపడుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today NOV 18:అనసూయను టార్చర్‌ పెట్టిన భరత్‌..పారిపోయి రామలింగాన్ని పెళ్లిచేసుకోమని ప్రియా సలహా
నువ్వులేక నేను లేను: అనసూయను టార్చర్‌ పెట్టిన భరత్‌..పారిపోయి రామలింగాన్ని పెళ్లిచేసుకోమని ప్రియా సలహా
Podarillu Serial Today NoV 18:విడాకుల కోసం కౌన్సెలింగ్‌కు హాజరైన చక్రి,మహాలక్ష్మీ...భార్యకు విడాకులు ఇస్తానని ఒప్పుకున్న చక్రి
పొదరిల్లు:విడాకుల కోసం కౌన్సెలింగ్‌కు హాజరైన చక్రి,మహాలక్ష్మీ...భార్యకు విడాకులు ఇస్తానని ఒప్పుకున్న చక్రి
Gundeninda Gudigantalu Nov18:ఇంటి అప్పుపై వడ్డీ కట్టాలని చింతామణి వార్నింగ్‌..నావల్ల కాదంటూ చేతులెత్తేసిన మనోజ్‌,చెంపపగులగొట్టిన ప్రభావతి
గుండెనిండా గుడిగంటలు:ఇంటి అప్పుపై వడ్డీ కట్టాలని చింతామణి వార్నింగ్‌..నావల్ల కాదంటూ చేతులెత్తేసిన మనోజ్‌,చెంపపగులగొట్టిన ప్రభావతి
Karthika Deepam 2 Serial Today November 18th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, సూరజ్‌ ప్రేమలకు సమాధి కట్టేసిన మాలిని! జ్యోత్స్న క్యారెక్టర్ చంపేసిన పారిజాతం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, సూరజ్‌ ప్రేమలకు సమాధి కట్టేసిన మాలిని! జ్యోత్స్న క్యారెక్టర్ చంపేసిన పారిజాతం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Mitchell Santner Injury: టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Embed widget