Lucky Dreams: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Lucky Dreams: మనుషులకు సహజంగానే కలలు వస్తుంటాయి. అయితే ఎలాంటి కలలు వస్తే మనుషులు త్వరలోనే కోటీశ్వరులు అవుతారో.. వారికి అఖండ రాజయోగం పడుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
Lucky Dreams: కలలు కనడం మానవసహజం అయితే ఆ కలలు కూడా మనుషుల భూత భవిష్యత్ వర్తనాలను తెలియజేస్తాయని స్వప్నశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఎటువంటి కలలు వస్తే మనుషుల కోటీశ్వరులు అవుతారో.. అవి ఏ టైం లో పడితే ఎన్ని రోజుల్లో నిజమవుతాయో కూలంకషంగా స్వప్నశాస్త్రంలో ఉందంటున్నారు. అయితే మంచి యోగాలను ఇచ్చే కలలే కాదు అశుభ కలలు వస్తే కూడా వాటి వల్ల కలిగే దుష్పరిణామాలకు నివారణ కూడా శాస్త్రాల్లో ఉందంటున్నారు పండితులు.
స్వప్నశాస్త్రంలో కలలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎవరికైనా సరే తెల్లవారుజామున వచ్చే కలలు త్వరగా నిజం అవుతాయి. కలలు వచ్చినప్పుడు ఆ కలలో కొన్ని వస్తువులు కనిపిస్తే త్వరతోనే మీరు కోటీశ్శరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి.
ఎవరికైనా కలలో దేవుళ్లు కనిపించినా.. దేవుళ్ల పటాలు కనిపించినా... దేవుళ్ల విగ్రహాలు కనిపించినా.. ఆలయాలు కనిపించినా ఆ వ్యక్తి త్వరలోనే కోటీశ్వరుడు అవుతాడట. అయితే కలలో కనిపించిన దేవుడి గుడికి మరుసటి ఉదయమే వెళ్లి అర్చన చేయించుకుని కొబ్బరికాయ కొట్టి రావాలట. అయితే గుడికి వెళ్లి పూజ చేయించుకుని వచ్చే వరకు ఆ కల గురించి ఎవ్వరికీ చెప్పకూడదట. అలా చేస్తేనే కల వల్ల వచ్చే ఫలితం పొందవచ్చిన స్వప్నశాస్త్ర పండితులు చెప్తున్నారు.
Also Read: బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కలలు వస్తున్నాయా? అంతా శుభమే!
ఎవరైనా చిన్నపిల్లలకు లక్ష్మీ దేవి ఇంట్లోకి వచ్చినట్లు కల వస్తే ఆ ఇంటి యజమాని త్వరలోనే కోటీశ్వరుడు అవుతాడట.
జమ్మి చెట్టు కనిపిస్తే రాజకీయంగా కలిసి వస్తుందట. ఆ వ్యక్తి ఏదైనా ఉద్యోగంలో ఉంటే వెంటనే ప్రమోషన్ వస్తుందట. చేస్తున్న పనిలో గౌరవం.. హోదా పెరుగుతాయట.
ఎవరికైతే కలలో తెల్ల గుర్రం కనిపిస్తుందో ఆ వ్యక్తి త్వరలోనే ఫ్యారిన్ వెళ్తాడట. విదేశాల్లో కోట్లకు కోట్లు డబ్బు సంపాదిస్తాడట. కలలో తెల్ల ఏనుగు కనిపిస్తే విపరీతమైన రాజయోగం పట్టుకుంటుందట. అధికారం బలం పెరుగుతుందట. కలలో నీళ్లు కనిపించినా.. త్వరలోనే ధనయోగం పట్టుకుంటుందని స్వప్నశాస్త్రం పండితులు చెప్తున్నారు.
కలలో తాచుపాము కనిపిస్తే చాలా మంచిదట. తాచుపాము రాబోయే అదృష్టానికి, ధనానికి సంపదకు సంకేతమట. తాచుపాము అనుగ్రహం వల్ల అఖండ రాజయోగం పడుతుందట.
కలలో పాము చెట్టు ఎక్కినట్లు కనిపిస్తే తొందరలోనే వాళ్లకు అఖండ ధన వృద్ది వస్తుందనడానికి సంకేతమట. ఇక ఎవరికైనా కలలో కొండ ఎక్కినట్టు కనిపిస్తే.. ఆ వ్యక్తికి త్వరగా రాజయోగం పడుతుందట. అలాగే చెట్టు ఎక్కిన్నట్టు ఏద్దు ఎక్కినట్టు, ఏనుగు ఎక్కినట్టు కల వస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారట. కలలో ఏడుస్తున్నట్టు కనిపించినా.. చనిపోయినట్టు కనిపించినా.. దీర్ఘాయువు వస్తుందట.
Also Read: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!
కలలో మిమ్మల్ని ఎవరైనా పెద్దలు దీవిస్తున్నట్లు కనిపిస్తే మీకు త్వరలోనే సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతారట. అలాగే కలలో పాలు తాగుతున్నట్లు కనిపించినా కూడా మీకు ఇదే ఫలితం వస్తుందట.
అయితే కలలలో పాములను చంపినట్లు, పక్షి మాంసాన్ని తిన్నట్లు.. చితిపైకి ఎక్కినట్టు.. ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుందట. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం కూడా మంచిది కాదట.
Also Read: పీడ కలలు వస్తున్నాయా? ఈ వాస్తు నియమాలు పాటిస్తే.. ధైర్యంగా నిద్రపోవచ్చు