చాణక్య నీతి: డాంబికం, కోపం అవసరమే!

నిర్విషేణాపి సర్పేణ కర్తవ్యా మహతీ ఫణా ।
విషమస్తు న చాప్యస్తు ఘటాటోపో భయంకరః ॥

ఆడంబరం, కోపం, డాంబికం కూడా మనిషికి అవసరమే అని చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా బోధించారు

కోరల్లో విషం లేకపోయినా కానీ పాము పడగవిప్పకపోతే జనం భయపడరు..పైగా చంపేస్తారు..

పాములో విషం ఉందో లేదో అన్ని ఎవరికీ తెలియదు..కానీ అది తల పైకెత్తితే చాలు పొడుస్తుందని భయపడతారు

మనిషులు కూడా కొన్ని సందర్భాల్లో ఈ విషయంలో పాములను ఫాలో అవ్వాలని సూచించారు చాణక్యుడు

సమాజంలో బతకాలంటే డాంబికం ప్రదర్శించాలి...లేని కోపాన్ని చూపించాల్సిన సందర్భాలు ఎదురవుతాయి

ఆడంబరం, కోపం, డాంబికంని ఏ సందర్భంలో ప్రదర్శించాలో తెలుసుకోవడం అవసరం

అనవసర సమయాల్లో వీటిని ప్రదర్శిస్తే ఉన్న గౌరవం పోతుంది.. అవసర సమయంలో ప్రదర్శిస్తే మర్యాద నిలుస్తుంది