మొదటిది త్యాగం, రెండోది వారి పాత్ర, మూడోది లక్షణాలు, నాలుగోది కర్మలను చూడడం... ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా వివరించారు చాణక్యుడు
సోమరితనం, చిన్నతనం, గర్వం, తరచూ అబద్ధాలు చెప్పేఅలవాటున్న వ్యక్తులను అస్సలు నమ్మకూడదు
ఎవరైతే ప్రశాంతంగా, గంభీరంగా, వాస్తవాలు మాత్రమే మాట్లాడుతారో వారిని విశ్వశించవచ్చు
త్యాగం గురించి మాట్లాడుతూ.. ఎదుటివారిలో సంతోషాన్ని చూసేందుకు తమ ఆనందాన్ని త్యాగం చేస్తారో అలాంటి వ్యక్తులను నమ్మొచ్చు
ఎదుటి వ్యక్తి ఎలాంటివారో స్పష్టంగా తెలిసేవరకూ వారిపై ఓ అభిప్రాయానికి వచ్చేయవద్దు..మంచి అయినా చెడు అయినా కానీ...
స్వార్థపూరిత వ్యక్తులు తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తుంటారు..అలాంటి వారి చేతినుంచి అత్యవసరం అయినా డబ్బు చేతికి రాదు.. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి
ఓ వ్యక్తితో స్నేహం చేసేటప్పుడు ఇవన్నీ గమనిస్తే.. ఆ స్నేహం ఎప్పటికీ నిలిచి ఉంటుందని చాణక్యుడు బోధించారు