దసరా 2024: విజయ దశమి 12 లేదా 13 ఎప్పుడు జరుపుకోవాలి!
తిథులు తగులు-మిగులు వచ్చినప్పుడు ఏ రోజు పండుగ జరుపుకోవాలనే సందేహం ఉంటుంది.
అక్టోబరు 11 శుక్రవారం ఉదయం 6 గంటల 44 నిముషాల వరకూ అష్టమి ఉంది..ఆ తర్వాత నవమి ఘడియలు ప్రారంభమయ్యాయి.. రోజంతా నవమి ఉండడంతో అక్టోబరు 11 మహానవమి వచ్చింది
అక్టోబరు 11 రాత్రి..తెల్లవారితే అక్టోబరు 12 శనివారం ఉదయం ఐదున్నర గంటల వరకూ నవమి ఉంది.. అప్పుడు దశమి ఘడియలు ప్రారంభమయ్యాయి
అక్టోబరు 12 శనివారం మొత్తం దశమి ఘడియలున్నాయి.. అందుకే ఎలాంటి సందేహం లేకుండా విజయదశమి వేడుకలు అక్టోబరు 12 శనివారమే జరుపుకోవాలి
సాయంత్రానికి దశమి తిథి ఉండడంతో పాటూ శ్రవణం నక్షత్రం రావడం అత్యంత విశేషం..అందుకే అక్టోబరు 12 శనివారం సాయంత్రం జమ్మిచెట్టు పూజ నిర్వహించాలి
వాహనాలకు ఆయుధ పూజ, అమ్మవారికి కుంకుమపూజ, హోమాలు నిర్వహించేవారు అయితే పూర్ణాహుతి.. జమ్మిచెట్టు పూజ అన్నీ శనివారమే చేయాలి
దేవీ త్రిరాత్ర వ్రతంలో భాగంగా దుర్గాష్టమి,మహర్నవమి,విజయ దశమి ఈ మూడు రోజులు పరిగణలోకి తీసుకుంటారు.. అక్టోబరు 10 దుర్గాష్టమి, అక్టోబరు 11 మహర్నవమి, అక్టోబరు 12 విజయ దశమి....
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే.
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు