గరుడవాహనంపై శ్రీవారు - ఈ సేవకు ఎందుకంత విశిష్టత!
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడవాహన సేవ విశిష్టమైనది. 108 వైష్ణవ దివ్యదేశాల్లో గరుడసేవకు అత్యంత ప్రముఖ్యత ఉంది.
శ్రీ మహావిష్ణువు వాహనం అయిన గరుత్మంతుడి ద్వారానే దేవతలకు ఆహ్వానం పంపిస్తారు..అదే ధ్వజారోహణం. ముక్కోటిదేవతలను బ్రహ్మోత్సవాలకు స్వయంగా ఆహ్వానిస్తాడు గరుత్మంతుడు.
జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుత్మంతుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 08 సాయంత్రం గరుడవాహనంపై శ్రీవారు విహరించనున్నారు
గరుడవాహన సేవ సందర్భంగా తిరుమలలో ఆంక్షలు విధించారు. 24 గంటల పాటు ద్విచక్ర వాహనాలను నిలిపేశారు. నడకమార్గం తెరిచి ఉంటుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు
గరుడవానన సేవ సందర్భంగా మూడున్నర లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా..మాడ వీధుల్లో రెండు లక్షల మంది భక్తులు ఈ సేవను ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేశారు
అక్టోబరు 08 సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 11 వరకూ గరుడవాహన సేవ జరగనుంది. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి చూసే భక్తులకు సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా దర్శన కల్పించనున్నారు.
పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించేందుకు క్యూ ఆర్ కోడ్ లు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బస్సులలో భక్తులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ..
తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి రూట్లలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడంతో పాటూ..తిరుమలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు.
గరుడ వాహన సేవ దర్శనం... సర్వపాప ప్రాయశ్చిత్తం