ఇంద్రకీలాద్రిపై మూడోరోజు - అన్నపూర్ణాదేవి అలంకారం
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞాన వైరగ్య సధ్ధ్యర్థం. భిక్షాం దేహిచ పార్వతి
మాత చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర:
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్
సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అమ్మ అన్నపూర్ణ దేవి. ఈ అలంకారాన్ని దర్శించుకుంటే ఆకలిదప్పులుండవు
సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అమ్మవారిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది
లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా అత్యవసరమైనది, గొప్పదైన విషయం మరొకటి లేదని చెప్పడమే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం
అన్నపూర్ణాదేవికి పసుపు రంగు లేదా గంధం రంగు వస్త్రాలు సమర్పిస్తారు.. ఈ రంగు దాన , ధర్మాలకు ప్రతీకగా చెబుతారు
అన్నపూర్ణ దేవికి గారెలు, క్షీరాన్నం, దధ్యోజనం నైవేద్యంగా సమర్పిస్తారు.
ఈ రోజు అన్నపూర్ణాదేవి అష్టకం చదివినా, విన్నా పుణ్యఫలం