రెండోరోజు గాయత్రి అలంకారంలో అమ్మవారు!
ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
త్రి సంధ్యలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ..ఆరోగ్యం, సంకల్పబలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధిస్తారు.
గాయత్రి మంత్రంతో సమానమైనది నాలుగు వేదాల్లోనూ లేదని విశ్వామిత్రుడు చెప్పాడు
పరమేశ్వరుడు బ్రహ్మానందంలో ఉన్నప్పుడు తన ఢమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు.
గాయత్రి మంత్రంలో ఉండే 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు అని చెబుతూ వాటికి పేర్లు కూడా పెట్టారు. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా , 12 తాంత్రిక మార్గాలున్నాయి .
గాయత్రి మంత్రాన్ని నిత్యం భక్తిశ్రద్ధలతో పఠించేవారిని 24 శక్తులు ఎల్లవేళలా కాపాడుతాయని చెబుతారు..
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనదని అర్థం
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’
తల్లిని మించిన దైవం.. గాయత్రిని మించిన మంత్రం లేదని అర్థం