శరన్నవరాత్రుల్లో మొదటి రోజు బాలాత్రిపుర సుందరి అలంకారం!
సర్వం రూపమయీ దేవీ, సర్వం దేవమయం జగత్
అతోహం విశ్వరూపాం, తాం నమామి పరమేశ్వరీమ్
కుమారిగా బాలత్రిపుర సుందరి , యవ్వనవతిగా లలితాత్రిపుర సుందరి, వృధ్ధరూపంలో త్రిపురభైరవి..శక్తి స్వరూపిణి మూడు రూపాల్లో బాలాత్రిపుర సుందరి మొదటిది
ముగ్గురమ్మలైన మూలపుటమ్మ అయిన బాలా త్రిపుర సుందరి రూప దర్శనం ఆనందాన్నిస్తుంది
అభయహస్తం, అక్షమాల ధరించిన బాలరూపాన్ని దర్శించుకుంటే బుద్ధి సరిగా పనిచేస్తుంది..ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి
షోడస విద్యకు అధిష్టాన దేవతగా చెప్పే బాలా త్రిపుర సుందరి అనుగ్రహం కోసం ఉపాశకులు దసరా నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు చేస్తారు
శ్రీ చక్రంలో మొదటి దేవత అయిన బాలా రూపాన్ని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయి..
భండాసురుడు అనే రాక్షసుడితో పాటూ రాక్షసుడి సంతానం అయిన 30 మందిని అర్థచంద్రాకార బాణంతో సంహరించింది బాలా
చిన్నారి అయినా సర్వశక్తిమంతురాలు అని భావించి ఆ రోజు నుంచి బాలా త్రిపురసుందరి రూపాన్ని పూజిస్తున్నారు