చాణక్య నీతి: చూసేవిధానం అంటే ఇదే!

ఏవ ఏవ పదార్థస్తు త్రిధా భవతి వీక్షతి
కృపణం కామినీ మాంసం యోగిభిః కామిభిః శ్వభిః

ఒకే సత్యం ఒక్కొక్కరికి వివిధ రకాలుగా కనిపిస్తుందనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా వివరించారు ఆచార్య చాణక్యుడు.

వస్తువు ఒకటే కానీ..దాన్ని చూసే విధానంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి.. ఒక్కొక్కరి దృష్టికోణం ఒక్కోలా ఉంటుంది

స్త్రీ శరీరాన్ని చూసే విధానాన్ని ఉదాహరణ చెప్పారు చాణక్యుడు

యోగి, రసికుడు, కుక్క ఈ ముగ్గురూ స్త్రీని ఎలా చూస్తారో చెప్పారు

స్త్రీ శరీరాన్ని కుళ్లిపోయిన మాంసపు ముద్దలా చూస్తాడు యోగి..అందుకే యావగించుకుంటాడు

స్త్రీ ని కామంతో చూస్తాడు కామకుడు - నిండైన వస్త్రధారణలో ఉన్నా ఆ వ్యక్తి ఆలోచన మారదు

కుక్కకి...స్త్రీ శరీం ఓ మాంసపు ముక్క అంతే.. ఆకలి తీర్చుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది

విషయం ఒకటే..చూసే విధానం వేర్వేరు.. అలా సత్యం ఒకటే అయినా దాన్ని చూసే విధానం వేరు అన్నది చాణక్యుడి భావన