తిరుమల: అక్టోబర్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు.. అక్టోబరు 1 న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఈ రోజు అష్టదళ పాద పద్మారాధన సేవ, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుచేసింది టీటీడీ
తమిళంలో.. కోయిల్ అంటే ‘పవిత్ర పుణ్యక్షేత్రం’, ఆళ్వార్ అంటే 'భక్తుడు', తిరు అంటే 'శ్రేష్ఠం', మంజనం అంటే 'స్నానం'. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం.
దేవతా మూర్తులను, ఇతర వస్తువులను గర్భగుడి నుంచి బయటికి తీసుకొచ్చి కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డతో కూడిన “పరిమళం” అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు.
మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. ఆ తర్వాత శ్రీవారి ప్రధాన మూర్తికి కప్పిన తెల్లని వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు
ఒక మహా యజ్ఞంలా సాగే ఈ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. ఏడాదికి నాలుగుసార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు
ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి , వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ .
టీటీడీ అక్టోబర్ 1న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. సెప్టెంబర్ 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించం అని.. భక్తులు గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది