చాణక్య నీతి: వినాశకాలం వస్తే బుద్ధి సహకరించకపోవడం అంటే ఇదే!



వినాశకాలే విపరీతబుద్ధిః సామెత మీరు వినేఉంటారుగా.. ఈ సామెతను ఓ శ్లోకం రూపంలో స్పష్టంగా వివరించారు ఆచార్య చాణక్యుడు



న నిర్మితా కేన న దుష్టపూర్వా న శ్రూయతే హేమమయూ కురంగీ
తథాఆపి తృష్ణా రఘునన్దనస్య వినాశకాలే విపరీతబుద్ధిః



బ్రహ్మదేవుడు బంగారులేడిని సృష్టించలేదు..అలాంటి లేడిని ఎవ్వరూ చూడలేదు..దానిగురించి వినలేదు కూడా



కానీ సీతాదేవికి ఆ బంగారులేడి కనిపించింది..వెంటనే కావాలి అని రామయ్యను అడిగింది



సీత అడిగింది సరే..రాముడు కూడా ఆ అసంభవాన్ని సంభవం అని నమ్మేసి వెళ్లిపోయాడు



అసలు బంగారు లేడి ఉంటుందా అని క్షణమైనా ఆలోచించలేదు..



కష్టాలు తప్పవు అన్నప్పుడు తెలివితేటలు నశిస్తాయి.. సహజంగా పనిచేసే బుద్ధి పనిచేయదు



దీనినే వినాశకాలే విపరీతబుద్ధిః అంటారని నీతిశాస్త్రంలో వివరించారు ఆచార్య చాణక్యుడు