తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందు ధ్వజారోహణం ఎందుకు?
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముందు అంకురార్పణ, ధ్వజారోహణం నిర్వహిస్తారు
అంకురార్పణ పూర్తైన తర్వాత ధ్వజారోహణం నిర్వహిస్తారు..అంటే దేవతలను ఆహ్వానించే కార్యక్రమం
శ్రీవారి వాహనం అయిన గరుత్మంతుడి ద్వారా ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు
ఓ నూతన వస్త్రంపై గరుత్మంతుడి చిత్రపటాన్ని వేసి..నూలుతో తయారు చేసిన కొడితాడు సహాయంతో ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు
ఉత్సవమూర్తులైన మలయప్పస్వామి, శ్రీదేవి, భూదేవి సమక్షంలో మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు
గరత్మంతుండి నుంచి ఆహ్వానం అందుకున్న ముక్కోటి దేవతలు బ్రహ్మోత్సవాలు చూసి ఆనందిస్తారు
రోజుకో రెండు వాహన సేవలు..ఆఖరి రోజు చక్రస్నానం నిర్వహిస్తారు..అనంతరం ధ్వజ అవరోహణం చేస్తారు
బ్రహ్మోత్సవాలు తిలకించిన దేవతలందరకీ వీడ్కోలుగా ధ్వజాన్ని అవరోహణం చేస్తారు..ఈ క్రియతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి