2024 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు!
ఏటా ఆశ్వయుజ మాసంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు..ఈ ఏడాద అక్టోబరు 4 నుంచి 12 వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి
శ్రీవారు స్వయంగా వైకుంఠం నుంచి భూలోకానికి దిగొచ్చే రోజులనే విశ్వాసంతో...నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు
ఆశ్వయుజమాసంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలనే వార్షిక బ్రహ్మోత్సవాలు, సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటారు
అప్పట్లో స్వామివారికి ఏడాదికి పదిసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు..14 రోజుల పాటూ నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు మాడవీధుల్లో విహరించడం ఏమీ ఉండేది కాదు.
స్వామివారు ఆలయంలో ధ్వజస్తంభం పక్కనున్న ఊంజల్ మండపంలో వాహనాలపై ఆసునుడై ఉంటే..అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించేవారు.
అక్టోబరు 03న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది...12 వ తేదీన చక్రస్నానం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి
ఉదయం 8 నుంచి 10...రాత్రి 7 నుంచి 9 రోజుకి రెండు వాహనసేవలు జరుగుతాయి...
బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుచేస్తారు..భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు