చాణక్య నీతి: మీ పోరాటం కాదు..మీ గెలుపే గుర్తుంటుంది!

ఎంత పోరాడాం అన్నది కాదు చివరకు గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అని నీతిసూత్రంలో చెప్పారు ఆచార్య చాణక్యుడు

కొన్ని సందర్భాలలో గెలుపు కోసం అడ్డదారులు ఎంచుకున్నా తప్పులేదు కానీ..అందులోనూ మీకో స్పష్టత ఉంచాలని సూచించారు

మీ చూపు, మాట, మాట్లాడే విధానం..అందరికన్నా వ్యత్యాసంగా ఉండాలి..ఓ వ్యవహారాన్ని డీల్ చేయడంలో భిన్నంగా ఆలోచించాలి

ఇతరుల సంతోషం మీకెందుకు..మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి..మీరు బావున్నప్పుడే నలుగురిని సంతోషంగా ఉంచగలరు

డబ్బు ఉన్నప్పుడు భారీగా ఖర్చుచేయడం..లేనప్పుడు చేయి చాచడం రెండూ వద్దు.. ధనానికి ఉన్న ప్రాధాన్యత గుర్తించండి

విజయానికి ఎంత దూరంలో మీరున్నారో..ఎలా వెళితే శిఖరానికి చేరుకుంటారో సరైన ప్రణాళిక వేసుకుని రంగంలోకి దిగండి

గతాన్ని గుర్తుచేసుకుని బాధపడడం బలహీనుల పని..వాటిని అనుభవాలుగా మార్చుకుని దూసుకెళ్లడం విజ్ఞులు చేసే పని

ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులతో స్నేహం మీకు తాత్కాలిక లాభాన్నిచ్చినా..భవిష్యత్ లో మీకు మిగిలేది అంధకారమే