తిరుమల: శ్రీవారికి రోజుకి ఎన్నిసార్లు నైవేద్యం సమర్పిస్తారు -ఆ సమయాన్ని ఏమంటారు!

Published by: RAMA

తిరుమల

తిరుమల శ్రీవారు అలంకార ప్రియుడు, అర్చన ప్రియుడు, ఉత్సవ ప్రియుడు మాత్రమే కాదు..నైవేద్య ప్రియుడు కూడా

తిరుమల

శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన లడ్డూని నైవేద్యంగా సమర్పించే లడ్డూ కోసం భక్తజనం పోటీపడుతుంటారు

తిరుమల

రోజూ తిరుమలేశుడికి మూడుసార్లు నైవేద్యం సమర్పిస్తారు..ఆ సమయాన్ని మొదటి గంట, రెండో గంట, మూడో గంట అని పిలుస్తారు

తిరుమల

సాధారణంగా నైవేద్య సమయాల్లో ఎలాంటి మార్పులు ఉండవు కానీ..కేవలం గురువారం, శుక్రవారం రోజుల్లో కేవలం రెండో గంట సమయంలో మాత్రమే మార్పుంటుంది

తిరుమల

మొదటి గంటలో భాగంగా శ్రీ వేంకటేశ్వరుడికి తొలి నివేదన సమయం ఉదయం 5.30 గంటలు

తిరుమల

రెండో గంట నైవేద్య సమయం ఉదయం 10గంటలకు ఉంటుంది...గురు, శుక్రవారాల్లో రెండో గంట సమయం కాస్త ముందుకు జరిగి..ఉదయం ఏడున్నరకు ఉంటుంది

తిరుమల

మూడో గంట నైవేద్య సమయం రాత్రి 7 గంటల 30 నిముషాలకు ఉంటుంది.

తిరుమల

తిరుమలేశుడికి సమర్పించే నైవేద్యాలు నిత్యం ఒకేలా ఉంటాయి కానీ ప్రతి నివేదనలోనూ వైవిధ్యం ఉంటుంది..