చాణక్య నీతి : మగవాడికి ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు!

వృద్ధకాలే మృతా భార్యా బన్ధుహస్తగతం ధనమ్
భోజనం చ పరాధీనం తిమ్ర పుంసాం విడమ్బనా

ఓ మగవాడి జీవితంలో అత్యంత దౌర్భాగ్యం అంటే ఏంటో ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా వివరించారు

ఈ శ్లోకానికి భావం ఏంటంటే... ముసలి కాలానికి భార్య చనిపోవడం, ధనం సోదరుల చేతిలోకి పోవడం..

భోజనం కోసం ఇతరులపై ఆధారపడడం..ఇంతకన్నా పెద్ద కష్టాన్ని ఏ పురుషుడికీ ఉండదు

ముసలితనంలో అనుక్షణం తోడుగా ఉంటుంది భార్య..ఆ తోడు కోల్పోతే ఇక ఒంటరితనమే

ఆస్తులన్నీ సోదరులు మోసం చేసి తీసుకుంటే ఏమీ చేయలేని దుస్థితి

ఈ రెండు కష్టాలన్నా భరించవచ్చు కానీ.. భోజనం కోసం ఇతరులపై ఆధారపడం అత్యంత దౌర్భాగ్యం

ఈ మూడు కష్టాలు లేకుండా ఎవరి జీవితం ముగుస్తుందో వారికన్నా అదృష్టవంతులు మరొకరు ఉండరు