చాణక్య నీతి: మరో అవకాశం లేకపోతే తప్పదు మరి!

ఆశవతస్తుభవేత్పాధుబ్రహ్మచారీ చ నిర్థనః!
వ్యాధిష్టో దేవభక్తశ్చ వృద్ధా నారీ పతివ్రతా!!

గత్యంతరం లేనప్పుడు ఉన్నవ్యక్తుల పక్షంవహించి శక్తిహీనుడు సాధువు అవుతాడు..

ధనహీనుడు గతిలేక బ్రహ్మచారిగానే మిగిలిపోతాడు

రోగంతో ఉండేవాడు నిత్యం భగవంతుడిని స్మరణలో ఉంటూ భక్తుడిగా మారిపోతాడు

స్త్రీ వృద్ధురాలు అయితే పతివ్రత అయిపోతుంది

బలహీనులే ఎక్కువమంది సాధువులుగా మారిపోతారు

వీళ్లంతా కావాలని ఆ దిశగా వెళ్లాలి అనుకోరు..గత్యంతరం లేక అలా జరిగిపోతుంది అంతే..

అలానే చాలామంది అవకాశాలు లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉండిపోతారన్నది చాణక్యుడు భావన