365 రోజులు - 450కి పైగా ఉత్సవాలు..శ్రీవారి వైభోగమే వేరు!
'స్మరణాత్సర్వపాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్ దర్శనా న్ముక్తిదం శ్రీనివాసం భజే నిశమ్'..స్వామిని తలుచుకుంటే చాలు సర్వపాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం
కోనేటిరాయుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ప్రతిరోజూ ఉత్సవమే.. దేవదేవుడికి ఏడాది పొడవునా ప్రత్యేకమే...
నిత్సోత్సవాలు : సుప్రభాతం, తోమాల సేవ, సహస్రనామార్చన
వారోత్సవాలు: అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారాభిషేకం
రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం నక్షత్రాల సమయంలో నక్షత్రోత్సవాలు
కోయిలాళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం, తెప్పోత్సవం, పద్మావతి పరిణయం, జేష్ఠాభిషేకం, ఆణివార ఆస్థానం, పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం
ప్రతిరోజూ పండుగే..ప్రతిపూటా పరమాన్న భరిత నివేదనలే..ఏడాదిపొడవునా కాదు...ఏడాదిలో రోజుల కన్నా స్వామివారికే జరిగే ఉత్సవాలే ఎక్కువ
సంవత్సరానికి ఉన్నవి 365 రోజులే కాని కొండలరాయునికి ఉత్సవాలు 450 కి పైనే...
నిత్యోత్సవాలు, వారోత్సవాలు, ప్రత్యేక సేవలు ఓ లెక్క..బ్రహ్మోత్సవం మరో లెక్క.. ఉభయదేవేరులతో కలసి మలయప్పస్వామి మాడవీధుల్లో విహరించే దృశ్యాలు చూసిన భక్తుల జన్మ ధన్యం..