చాణక్య నీతి: ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సమస్యే రాదు! ఆచార్య చాణక్యుడి సూచనలు అనుసరిస్తే ఎంతటి కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోవచ్చంటారు పండితులు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలని ఆలోచించేకన్నా..ఆ సమస్యే రాకుండా జాగ్రత్తపడాలన్నదే చాణక్యుడి సూచన ముఖ్యంగా మూడు విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే మీరు వద్దన్నా సమస్య పలకరించకమానదు.. రోగాలు, శత్రువులు, పాములు..ఈ మూడు విషయాల్లో అప్రమత్రంగా లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే రోగం, శత్రువు, పాము..ఈ మూడు కూడా కాటేసేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటాయి..అందుకే నిర్లక్ష్యం తగదు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే వ్యాధులు వెంటాడుతూనే ఉంటాయి..ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు శత్రువు సైలెంట్ గా ఉన్నాడని బలహీనుడు అని భ్రమపడొద్దు.. ఓడినవారు నిశ్శబ్ధంగా కనిపిస్తారు కానీ అవకాశం కోసం కాచుకుని కూచుంటారు పాము మనకు తెలియకుండానే కాటేసి వెళ్లిపోతుంది..ఇది కూడా మీచుట్టూ ఉండే కొందరు వ్యక్తులకు వర్తిస్తుంది