తిరుమల

శేషగిరుల్లో 66 కోట్ల తీర్థాలు - మీరెన్ని దర్శించుకున్నారు!

Published by: RAMA

తిరుమల

తిరుమల కొండలపై 66 కోట్లు పుణ్యతీర్థాలున్నాయని వివరిస్తోంది బ్రహ్మపురాణం, స్కంధపురాణం.

తిరుమల

66 కోట్ల పుణ్యతీర్థాలను ధర్మరతి, జ్ఞానప్రద, భక్తి వైరాగ్య, ముక్తిప్రదం అంటూ 4 రకాలుగా విభజించారు

తిరుమల

ధర్మరతిప్రద తీర్థాల సంఖ్య 1008 - ఈ తీర్థాల్లో జలాన్ని సేవిస్తే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.. భగవంతుడిపై భక్తివిశ్వాసాలు ఏర్పడతాయి

తిరుమల

జ్ఞానప్రద తీర్థాల సంఖ్య 108 - ఈ తీర్థాల్లో జలాన్ని సేవిస్తే జ్ఞానయోగం సిద్ధిస్తుంది. మను , ఇంద్ర , వసు , రద్ర , ఆదిత్య సహా
పంచభూతాలు, మహర్షులు, అష్టదిక్పాలకుల పేర్లతో ఉన్నాయి

తిరుమల

భక్తి వైరాగ్యప్రద తీర్థాలు 68 - జ్ఞానపద తీర్థాల కన్నా అత్యంత శ్రేష్టమైనవి. ఈ తీర్థాల్లో జలాన్ని సేవిస్తే వైరాగ్య , దైవభక్తి పెరుగుతుంది.

తిరుమల

ముక్తిప్రద తీర్థాలు 7 - తిరుమల క్షేత్రానికి వెళ్లేవారు ఇవి తప్పనిసరిగా దర్శించుకుంటారు.. ఈ తీర్థాల్లో స్నానమాచరించేందుకు ప్రత్యేక రోజులున్నాయి

తిరుమల

శ్రీస్వామి పుష్కరిణి - బ్రహ్మోత్సవాలు, రథసప్తమి సమయంలో ఇక్కడ స్నానమాచరించాలి
కుమారధార - కుంభమాసంలో పౌర్ణమి రోజు స్నానమాచరించాలి

తిరుమల

తుంబుర తీర్థం - మీన మాసంలో ఉత్తర పాల్గుణీ నక్షత్రంతో వచ్చిన పౌర్ణమి రోజు
రామకృష్ణ తీర్థం - మకర మాసంలో పుష్యమి నక్షత్రాయుత పౌర్ణమి రోజు

తిరుమల

ఆకాశగంగ - మేష మాసం చిత్తా నక్షత్రయుత పౌర్ణమి
పాపవినాశనం - ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో ఉత్తరాఢ నక్షత్రాయుత సప్తమి ఆదివారం

తిరుమల

పాండవ తీర్థం - వృషభమాసంలో శుద్ధ ద్వాదశి ఆదివారము లేదా బహుళ ద్వాదశి మంగళవారం ఈ తీర్థంలో స్నానమాచరించేందుకు పుణ్యకాలం