మరింత వెలిగిపోతున్న తిరుమల!
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమైంది..అక్టోబరు 03 సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది..అక్టోబరు 04 ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి
శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగుతాయి. బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి ముందురోజు నిర్వహించేదే అంకురార్పణ
ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు ఎలాంటి ఆంటకాలు లేకుండా విజయంవంతం కావాలని ప్రార్థిస్తూ అంకురాలను వేస్తారు..అందుకే అంకురార్పణ అంటారు
ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పాలికలలో పుట్టమన్ను వేస్తారు..అందులో నవధాన్యాలు నాటుతారు. అవి బాగా మొలకలు వచ్చేలా బ్రహ్మోత్సవాల్లో నీత్యం నీరు పోస్తారు
నవధాన్యాలు మొలకలు ఎంత బాగా వస్తే అంత ఘనంగా ఉత్సవాలు జరుగుతాయని విశ్వసిస్తారు. అంకురార్పణ ఘట్టం తర్వాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.
అక్టోబరు 04 ధ్వజారోహణంతో సకలదేవతలకు ఆహ్వానం పంపుతారు..అనంతరం పెద్ద శేషవాహనసేవ జరుగుతుంది...
బ్రహ్మోత్సవాలు సందర్భంగా తిరుమల వీధులన్నీ వెలిగిపోతున్నాయి...
అలిపిరి నుంచి శ్రీవారి మాడ వీధులవరకూ విద్యుత్ కాంతులతో నింపేశారు...