ఏ రోజు ఏ రంగుకి ప్రాధాన్యం!
శైలపుత్రికి ప్రీతికరమైన ఈ రంగు ఆనందానికి, సంతృప్తికి సూచన..ఈ రోజు అమ్మవారికి గులాబీపూలతో పూజ చేయాలి
శివుడికోసం తపస్సు ఆచరించిన బ్రహ్మచారిణికి సూచన తెలుపు. ఈ రోజు అమ్మవారికి తెల్లటి పూలతో పూజ చేయాలి
చంద్రఘంట దేవి ఎర్రని వస్త్రాలతో భక్తులకు దర్శనమిస్తుంది..ధైర్యం, బలానికి సూచన ఈ రంగు - ఈ రోజు అమ్మవారిని ఎరుపు రంగు పూలతో పూజించాలి
కూష్మాండ అమ్మవారికి ప్రీతికరమైన రంగు నారింజ. కాంతికి మూలం ఈ కలర్.
కార్తికేయుడిని ఒడిలో కూర్చోబెట్టుకునే స్కందమాతకు అంకితం పసుపు. పసుపు రంగు వస్త్రం సమర్పించి, పసుపు రంగు పూలతో పూజచేయాలి.
కాత్యాయని అమ్మవారికి ముదురు ఎరుపురంగు వస్త్రాలు సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అవివాహితులు ఈ రూపాన్ని పూజిస్తే శుభం జరుగుతుంది.
కాళరాత్రి అమ్మవారికి నీలి రంగు వస్త్రాలు సమర్పించి నీలి రంగు పూలతో పూజ చేయాలి.
శుద్ధికి సూచనగా చెప్పే ఆకుపచ్చ మహాగౌరికి ప్రీతికరమైన రంగు..ఎనిమిదో రోజు మహాగౌరికి ఆకుపచ్చని వస్త్రాలు సమర్పిస్తే జీవితంలో సుఖశాంతులుంటాయి
నవరాత్రుల్లో ఆఖరి రోజు సిద్దిధాత్రికి లేత గోధుమరంగు వస్త్రాలు సమర్పిస్తారు. జీవితంపై స్పష్టతకు ఈ రంగు సూచన