అక్టోబర్ 9 - సరస్వతి అలంకారం దర్శనం మహాభాగ్యం!
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ద షష్టి, మూలా నక్షత్రం రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది
మూలా నక్షత్రం అంటే సరస్వతీదేవి జన్మనక్షత్రం.. ఈ రోజు చదువుల తల్లిని దర్శించుకుంటే చదువు, ఉద్యోగంలో ఉన్నతిని పొందుతారని భక్తుల విశ్వాసం
త్రిశక్తుల్లో ఒకరైన సరస్వతీ అలంకరణలో ఉన్న దుర్గమ్మని దర్శించుకోవడమే మహాభాగ్యంగా భావిస్తారు
శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజు నుంచి ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది.
భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ మేరకు వీఐపీ దర్శనాలు రద్దుచేశారు.
వినాయక ఆలయం నుంచి ఘాట్ రోడ్డు వరకూ క్యూలైన్లలో భక్తులు అమ్మవారి దర్శార్థం వేచి ఉన్నారు.. దీంతో వీఎంసీ వద్ద కంపార్ట్ మెంట్లు ఏర్పాటు చేశారు పోలీసులు..
అక్టోబరు 09 మూలానక్షత్రం రోజు నుంచి వరుసగా నాలుగు రోజులపాటూ దుర్గగుడిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది
అక్టోబరు 10 దుర్గాష్టమి రోజు దుర్గమ్మగా, అక్టోబర్11న మహిషాసురమర్దిని, అక్టోబర్ 12న రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తుంది అమ్మవారు