దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ ఎందుకు!

Published by: RAMA

దుర్గాష్టమి

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ శరన్నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటారు

దుర్గాష్టమి

చివరి మూడు రోజులు మరింత ప్రత్యేకం..ఆ మూడు రోజుల్లో మొదటిది దుర్గాష్టమి

దుర్గాష్టమి

వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి దుర్గాష్టమి రోజు అస్త్ర పూజ చేస్తారు

దుర్గాష్టమి

పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లేసమయంలో ఆయుధాలను జమ్మిచెట్టుపై ఉంచి వెళ్లారు

దుర్గాష్టమి

అజ్ఞాతవాసం పూర్తిచేసుకుని ఉత్తర గోగ్రహణ యుద్ధం సమయంలో జమ్మిచెట్టుని ప్రార్థించి ఆయుధాలను తిరిగి పొంది యుద్ధం చేశారు

దుర్గాష్టమి

జమ్మిచెట్టుని పూజించి ఆయుధాలను తీసుకెళ్లి విజయం సాధించడంతో శమీవృక్షం విజయానికి సూచనగా చెబుతారు

దుర్గాష్టమి

దుర్గాష్టమి రోజు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు..బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి అనే 8 శక్తి రూపాలను పూజిస్తారు

దుర్గాష్టమి

వ్యాపారులు దుకాణాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించేవారు దసరా ఆరంభం నుంచి సన్నాహాలు చేసుకుని విజయదశమి రోజు ప్రారంభిస్తారు..

దుర్గాష్టమి

దుర్గాష్టమి సందర్భంగా మీకు సమీపంలో ఉన్న శక్తి పీఠాన్ని దర్శించుకుంటే శుభం జరుగుతుందని పండితులు చెబుతారు