దసరా శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!
వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్!
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్!!..
ఈ విజయ దశమి మీకు విజ్ఞానం, శాంతి, శ్రేయస్సు కూడిన విజయాన్ని అందించాలి..మీ జీవితంలో సంతోషం వెల్లివిరియాలి
ఈ పవిత్రమైన రోజున మీరు చేపట్టే పనుల్లో అడ్డంకులు తొలగిపోయి విజయం మీ సొంతం అవ్వాలని కోరుకుంటూ విజయ దశమి శుభాకాంక్షలు
చెడుపై మంచి సాధించిన విజయాన్ని మనం జరుపుకుంటున్నప్పుడు మీ జీవితంలో మంచితనం ప్రకాశవంతంగా వెలగాలి
మీరు సత్యం, ధర్మంవైపు అడుగేస్తున్నప్పుడు మీ జీవితంలో ప్రేమ, సంతోషం అన్నీ సానుకూల అంశాలే నిండి ఉంటాయి
కుటుంబ సమేతంగా సవాళ్లపై విజయం సాధించి భవిష్యత్ పై ఆశతో అడుగువేయండి
మీ జీవితంలో ప్రతికూలతకు ముగింపు చెప్పి
ఆశలకు, కొత్త సంతోషాలకు ఆహ్వానం పలకండి
అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథులమౌక్తిక శోభినాసమ్
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్!
ఓం సర్వరూపే సర్వేశే సర్వశక్తి సమున్నతే..
భయేభ్యసాహి నో దేవి. దుర్గాదేవి నమోస్తుతే..
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే…