2024 ధన త్రయోదశి డేట్ & శుభ మహూర్తం!
ధన త్రయోదశి ఈ ఏడాది అక్టోబరు 30 బుధవారం వచ్చింది..ఆ మర్నాడు అక్టోబరు 31 నరకచతుర్థశి, దీపావళి..
వాస్తవానికి అక్టోబరు 29 మంగళవారం రోజే త్రయోదశి తిథి ఉంది..ఆ రోజు ఉదయం పదిన్నర వరకూ ద్వాదశి తిథి ఉంది.. ఆ తర్వాత త్రయోదశి ప్రారంభమైంది..
ధన త్రయోదశి తిథి సూర్యోదయానికి ఉండడం ప్రధానం..అందుకే అక్టోబరు 30 బుధవారం ధనత్రయోదశి జరుపుకుంటారు
అమృతం కోసం దేవతలు - రాక్షసులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి ఇదే రోజు ఉద్భవించింది. ఆమెను భార్యగా స్వీకరించిన శ్రీ మహావిష్ణువు ఐశ్వర్యానికి అధిదేవతగా ప్రకటించాడు
ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనాధిదేవత జన్మదినోత్సవంగా భావిస్తారు..అందుకే దీనిని ధన త్రయోదశి అని పిలుస్తారు
కొన్ని ప్రాంతాల్లో ధన త్రయోదశిని మూడు రోజుల పండుగగా జరుపుకుంటారు. గుజరాత్, మహారాష్ట్ర సహా దేశంలో చాలా ప్రాంతాల్లో ధన త్రయోదశిని వైభవంగా జరుపుకుంటారు
సూర్యాస్తమయ సమయంలో ఇంటి ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు..వాటిని యమదీపాలు అంటారు
ధనత్రయోదశి రోజు చేసే దాన, ధర్మాలు, పూజలు విశేష ఫలితాలన్నిస్తాయని భక్తుల విశ్వాసం