అన్వేషించండి

Brahmamudi Serial Today march 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: దుగ్గిరాల గుర్తులు మొత్తం చెరిపేసిన రేఖ – బాధలో అపర్ణ

Brahmamudi serial today episode march 2nd: ఇంట్లో ఉన్న దుగ్గిరాల ఫ్యామిలీ ఫోటోలు మొత్తం కాల్చేస్తుంది రేఖ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode:  స్వరాజ్‌కు గతం గుర్తుకు రావడం లేదని.. ఇక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్‌ ఇద్దామని లక్ష్మీ వాళ్ల భర్త చెప్పడంతో లక్ష్మీ కూడా అలాగే చేయండి అని చెప్తుంది. అయితే తన ఫ్రెండ్‌ కోటిని కలిసి విషయం చెప్తా అంటాడు లక్ష్మీ భర్త.

లక్ష్మీ: పోలీస్‌ కంప్లైంట్‌ ఇస్తే.. వీడి కోసం ఎవరైనా వెతుకుతుంటే.. వాళ్లకు తెలుస్తుంది కదా..?

లక్ష్మీ భర్త: అవును లక్ష్మీ అదే సరైనది

అనుకుంటారు ఇద్దరు.. మరోవైపు రేఖ దుగ్గిరాల ఫ్యామిలీ ఫోటోలు మొత్తం తీసుకొచ్చి బయటపడేసి కాల్చేస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన అపర్ణ వస్తుంది.

అపర్ణ: రేఖ ఏం చేస్తున్నావు.. ఇవన్నీ నా వాళ్ల జ్ఞాపకాలు ఆపు రేఖ..

రేఖ: ఏయ్‌ ఇక నుంచి దుగ్గిరాల కుటుంబానికి సంబంధించిన ఏ జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అందుకే తగులబెట్టేస్తున్నాను.

అపర్ణ: రేఖ వద్దు రేఖ నాకంటూ మిగిలింది ఇవి మాత్రమే ఫ్లీజ్‌ రేఖ వద్దు రేఖ వదిలేయ్‌ రేఖ

రేఖ: ఇక నుంచి ఈ ప్రపంచం రుద్రాణి కుటుంబాన్ని మాత్రమే గుర్తు పెట్టుకోవాలి. దుగ్గిరాల వంశం అనేది ఈరోజుతో కాలి బూడిదైపోతుంది. నీ మనవరాళ్లు పెరిగి పెద్దైన తర్వాత కూడా వాళ్ల అమ్మానాన్నలు ఎలా ఉంటారో కూడా వాళ్లకు తెలియకూడదు. వాళ్ల మనసుల్లో ఒక్కటే ఉండాలి. ఈ రేఖ అంటే భయం ఉండాలి. నేను ఏం చెప్తే అది చేయాలన్న భయం మాత్రమే ఉండాలి. ఈరోజు నుంచి నువ్వు వాళ్లను అలాగే పెంచాలి.

అంటూ వార్నింగ్‌ ఇచ్చి రేఖ వెళ్లిపోతుంది. అపర్ణ ఏడుస్తూ అక్కడే నిలబడి చూస్తుంటుంది. మరోవైపు లక్ష్మీ భర్త బయటి నుంచి ఇంటికి వెళ్లగానే..

లక్ష్మీ: ఏంటండి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తానన్నారు కదా వెళ్లలేదా..?

లక్ష్మీ భర్త:  వెళ్లాను.. నా ఫ్రెండ్‌ కానిస్టేబుల్‌ కోటిని అడిగాను.. కానీ సిటీలో పిల్లాడు మిస్‌ అయినట్టుగా ఏ కేసు రాలేదంట. శ్రీశైలం పోలీస్‌ స్టేషన్‌కు కూడా ఫోన్‌ చేసి కనుక్కున్నాడు. అక్కడ కూడా ఏ ప్రమాదం కేసు రాలేదట.

లక్ష్మీ: ఇన్ని రోజులైనా ఎవ్వరూ మిస్సింగ్‌ కంప్లైంట్ ఇవ్వలేదు అంటే వాళ్ల అమ్మానాన్నలు ఏదైనా ప్రమాదంలో

లక్ష్మీ భర్త: నాకు అదే అనిపిస్తుంది లక్ష్మీ

అప్పుడే స్వరాజ్‌ లోపలి నుంచి మమ్మీ అంటూ బయటకు వస్తాడు.. లక్ష్మీ భర్త రాజ్‌కు కేక్‌ ఇస్తాడు. లక్ష్మీ… రాజ్‌కు రాజు అని పేరు పెడుతుంది. తర్వాత రేఖ తన పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తుంటే అపర్ణ వెళ్తుంది.

అపర్ణ: రేఖ వీళ్లకు కూడా అక్షరాభ్యాసం చేయించాలి.

రేఖ: వాళ్లకు అవసరం లేదు నీ మనవరాళ్లను చదివించాలన్న ఆలోచన ఇక్కడితే వదిలేసేయ్‌.. లేదంటే.. నిన్ను కూడా ఆ కైలాస దర్శనానికి పంపించేయాల్సి ఉంటుంది

అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే.. అపర్ణ వెళ్లిపోతుంది. ఒక్కతే కూర్చుని బాధపడుతుంటే కావ్య ఆత్మ వచ్చి అపర్ణకు ధైర్యం చెప్తుంది.

కావ్య: మీరే చేయగలరు అత్తయ్యా

అపర్ణ: కావ్య నా జీవితానికి బాధ ఒక్కటే మిగిలింది. ఈ పసివాళ్లకు నేను ఏమీ చేయలేకపోతున్నాను.. నన్ను క్షమించు నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాను.

కావ్య: మనం ఎలా ఆలోచిస్తామో మన పిల్లల భవిష్యత్తు అలాగే ఉంటుంది.

అపర్ణ: ఆ రేఖను ఎదురించి నేను ఏం చేయగలను చెప్పు

కావ్య: అత్తయ్య కొన్ని సార్లు అవకాశం మనకు అనుకూలంగా లేనప్పుడు పరిస్తితులకు తలవంచి కొత్త దారులు వెతుక్కోవాలి అత్తయ్యా.. దారి కనిపించలేదు అని ఆగిపోతే చీకట్లోనే మిగిలిపోతాం.. ఒక కొత్త దీపాన్ని వెలిగిస్తే కొత్త దారులు తెరుచుకుంటాయి.. ఆ రేఖ చెప్పిన మాటకు మీరు ఆగిపోవాలా..? చదువుకోవాలంటే స్కూల్‌కు వెళ్లాలా..? గురువు చెప్తేనే నేర్చుకోవాలా..? మీరు ప్రయత్నిస్తే తప్పకుండా అవకాశం దొరుకుతుంది అత్తయ్య.. ఈ పసివాళ్ల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అత్తయ్యా..

అపర్ణ: అర్థం అయింది కావ్య ఎవరేం చెప్పినా సరే నేనే వీళ్లకు గురువు అవుతాను.. నేనే చదువు చెప్తాను.. నా కళ్లతోనే వీళ్లకు ప్రపంచాన్ని చూపిస్తాను.. కుళ్లు కుతంత్రాలతో నిండిపోయిన సమాజంతో ఎలా పోరాడాలో నేర్పిస్తాను.. నువ్వు ఆశపడినట్టుగానే.. వీళ్ల భవిష్యత్తును నేను అందంగా తీర్చిదిద్దుతాను..

అని చెప్తుండగానే కావ్య ఆత్మ మామయైపోతుంది. తర్వాత పిల్లలకు పలకలు తీసుకొచ్చి అపర్ణ చదువు చెప్తుంటే.. రేఖ వచ్చి తిట్టి పలకలు పగులగొట్టి ఇంకొక్కసారి వీళ్లకు చదువు చెప్పాలని చూస్తే.. వీళ్ల చేతులు విరిచేస్తాను..ఇంకొక్కసారి ఇలా చేస్తే.. నేను వినను ఇదే నా లాస్ట్‌ వార్నింగ్‌.. అని వెళ్లిపోతుంది. అయినా అపర్ణ మళ్లీ బియ్యం తీసుకుని వచ్చి పిల్లలకు బియ్యలో చదువు చెప్తుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today October 15th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: కేసు వాపస్ తీసుకోవాలి అంటే ఆ పని చేయాల్సిందే! వల్లీ కండీషన్‌కి నర్మద, ప్రేమ ఒప్పుకుంటారా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: కేసు వాపస్ తీసుకోవాలి అంటే ఆ పని చేయాల్సిందే! వల్లీ కండీషన్‌కి నర్మద, ప్రేమ ఒప్పుకుంటారా!
Jagadhatri Serial Today October 14: నిషిక కోసం గోడదూకి ఇంట్లోకి వచ్చిన మురళి...కొట్టి చంపేసిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: నిషిక కోసం గోడదూకి ఇంట్లోకి వచ్చిన మురళి...కొట్టి చంపేసిన కౌషికి
Karthika Deepam 2 Serial Today October 15th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న చచ్చిపోయింది? ఆ బాడీ జ్యోత్స్నదేనా! కుప్పకూలిపోయిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న చచ్చిపోయింది? ఆ బాడీ జ్యోత్స్నదేనా! కుప్పకూలిపోయిన సూరజ్!
Brahmamudi Serial Today October 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: శోభనం జరిగినట్టు లక్కీ బిల్డప్‌ - ఆఫీసులో స్టాప్‌ను తీసేసిన ఐశ్వర్య  
‘బ్రహ్మముడి’ సీరియల్: శోభనం జరిగినట్టు లక్కీ బిల్డప్‌ - ఆఫీసులో స్టాప్‌ను తీసేసిన ఐశ్వర్య  

వీడియోలు

West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget