kalavari kodalu kanaka mahalakshmi serial today march 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తను ప్రెగ్నెంట్ అని తెలిసి సంతోషంలో లక్ష్మీ! విహారికి చెప్తుందా!
అంబిక ఇచ్చిన ఆఫర్‌తో ఎస్‌ఐ లక్ష్మీని ఏదో ఒక కేసులో ఇరికించాలని.. తాగడానికి నీరు ఇచ్చి మంచిగా మాట్లాడుతుంది. కానిస్టేబుల్ మనసులో ఇలా మాట్లాడుతుంటే లక్ష్మీ నీరు తీసుకునే టైంకి ఎస్‌ఐ కింద పడేస్తుంది.

kalavari kodalu kanaka mahalakshmi serial today episode అంబిక ఇచ్చిన ఆఫర్‌తో ఎస్‌ఐ లక్ష్మీని ఏదో ఒక కేసులో ఇరికించాలి అని అనుకుంటుంది. లక్ష్మీని బయటకు పిలిపించి తాగడానికి నీరు ఇచ్చి మంచిగా మాట్లాడుతుంది. కానిస్టేబుల్ మనసులో ఇలా మాట్లాడుతుంటే ఏదో అనుమానంగా ఉందని అనుకుంటుంది. లక్ష్మీ నీరు తీసుకునే టైంకి ఎస్‌ఐ కింద పడేస్తుంది. ఆ గ్లాస్‌ని తన్నేస్తుంది. తర్వాత లక్ష్మీని పట్టుకొని తప్పుని ఒప్పుకోవడానికి నీకు అంత బలుపు ఏంటే అని అంటుంది.
లక్ష్మీ ఏడుస్తూ నేను ఏ తప్పు చేయలేదు మేడమ్ అంటుంది. ఎస్‌ఐ లక్ష్మీ తాళి పట్టుకొని పెళ్లి అయి కూడా ఇలాంటి పనులు చేయడం ఏంటే.. అని అడుగుతుంది. మేడమ్ అని లక్ష్మీ అరుస్తుంది. దయచేసి ఈ విషయంలో ఇంతకు మించి మాట్లాడొద్దు అని అంటుంది. ఎస్‌ఐ తాళి వదలకపోవడంతో లక్ష్మీ ఎస్‌ఐని నెట్టేస్తుంది. నీకు రోషం పౌరుషం ఎక్కువేనే రేపు నీ కోసం వాడు( విహారి) బెయిల్ తెస్తాడు అనుకున్నావ్ కదా అని లక్ష్మీని నెట్టేస్తుంది. తర్వాత కానిస్టేబుల్స్‌ని పిలిచి కానివ్వండి అని అంటుంది. దాంతో లేడీ కానిస్టేబుల్స్ వాళ్లంతట వాళ్లే కొట్టుకొని గాయాలు చేసుకుంటారు. ఏం చేస్తున్నారు మీరంతా అని లక్ష్మీ అంటుంది. మన మీదే ఇది దాడి చేసి చేయి చేసుకుంది ఇలా ఏ సక్షన్ అయితే అవన్నీ కలిపి దీని మీద కేసు వేయండి అని చెప్తుంది. లక్ష్మీ షాక్ అయిపోతుంది. లక్ష్మీని ఎస్‌ఐ తీసుకెళ్లి సెల్‌లోకి విసిరేస్తుంది.
లక్ష్మీ కింద పడిపోతుంది. కళ్లు తిరిగి పడిపోయిన లక్ష్మీని మరో కానిస్టేబుల్ చూస్తుంది. ముఖం మీద నీళ్లు వేసి లక్ష్మీని లేపి ఈ రోజు నుంచి నీ కొత్త జీవితం ప్రారంభం అవుతుంది అమ్మా.. నీ నాడి నేను చూశాను.. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్తుంది. లక్ష్మీ కడుపు మీద చేయి వేసుకొని చాలా హ్యాపీగా ఫీలవుతుంది. నీ కడుపులో ఇంకో ప్రాణం ఉంది రెస్ట్ తీసుకోమ్మా జాగ్రత్తగా ఉండు అని కానిస్టేబుల్ చెప్పి వెళ్లిపోతుంది. లక్ష్మీ స్టేషన్‌లో ఏడుస్తుంటే ఇంటి దగ్గర యమున, విహారి, చారుకేశవ ఇలా మనిషో దగ్గర బాధ పడుతూ ఉంటారు. భుజంగం తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంటాడు.
ఉదయం విహారి లాయర్‌ని తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వస్తాడు. లక్ష్మీకి ఈ రోజు ఎలా అయినా బెయిల్ రావాలి అని తనని అన్యాయంగా అరెస్ట్ చేసిన ఎస్‌ఐకి శిక్ష పడేలా చేయాలి అంటాడు. విహారి లక్ష్మీ దగ్గరకు వెళ్లగానే లక్ష్మీ సంతోషంగా తను ప్రెగ్నెంట్ అని చెప్పాలి అనుకుంటుంది. అంతలోనే ఆగిపోయి.. ఇప్పుడు నేను నిజం చెప్పేస్తే ఇంట్లో అందరికీ విషయం చెప్పేస్తారు అని ఆగిపోతుంది. విహారి లక్ష్మీతో నువ్వేం భయపడకు నేను నిన్ను ఎలా అయినా తీసుకెళ్తా అని అంటాడు. లాయర్ ఎస్‌ఐకి బెయిల్ పేపర్స్ ఇస్తాడు. బెయిల్ పేపర్స్ తెచ్చినా సరే కనకాన్ని వదలను తన మీద ఒక్క కేసు కాదు మరో కేసు నమోదు అయింది అని కానిస్టేబుల్స్‌ని పిలిచి చూపిస్తుంది.
డ్యూటీలో ఉన్న పోలీసుల మీద దాడి చేసినందుకు బెయిల్ క్యాన్సిల్ అయింది అని అంటుంది. లాయర్ విహారిని పక్కకి తీసుకెళ్లి లక్ష్మీకి బెయిల్ రావడం కష్టం ఆ ఎస్‌ఐ కావాలనే ఇలా చేస్తుంది అంటాడు. కోర్టుకి వెళ్లే వరకు లక్ష్మీకి జైలు శిక్ష తప్పదా అని అంటాడు. తప్పదు అని లాయర్ అంటారు. లక్ష్మీ ఎస్ఐతో మీరు ఎందుకు నా మీద పగ పట్టారు.. నా మీద ఈ కేసులు ఎవరు పెట్టమని చెప్పారు.. ఎవరి దగ్గర మీరు లంచం తీసుకున్నారు అని అడుగుతుంది. ఇంకోసారి ఇలా మాట్లాడితే చంపేస్తా అని ఎస్‌ఐ అంటుంది. విహారి వచ్చి కనకం మీద మీరు బనాయించిన కేసులు అన్నీ తప్పు అని నిరూపిస్తా.. మీ ఉద్యోగం పోయేలా చేస్తా అని విహారి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























