అన్వేషించండి

Kamareddy Crime News: కామారెడ్డిలో ఇంకా వీడని మిస్టరీ, ముగ్గురి మృతిపై ఆ ప్రచారంలో నిజం లేదు

Telangana Crime News | తెలంగాణలో సంచలనంగా మారిన కామారెడ్డి జిల్లాలో ముగ్గురి మృతి కేసు మిస్టరీ వీడటం లేదు. ప్రత్యక్ష సాక్షులు, లేఖలు లాంటివి లేకపోవడంతో కేసు ముందుకు వెళ్లడం లేదు.

Bikkanur SI Lady constable Suicide | కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ఇద్దరు పోలీసులు, ఓ కంప్యూటర్ ఆపరేటర్ మృతి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే వీరి ఒంటిపై గాయాలున్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. మృతదేహాల ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. వీరి మరణాలకు ముందు ఎలాంటి గొడవ, దాడులు జరగలేదు. కేవలం నీటిలో మునగడం ద్వారా వారు చనిపోయారని నిర్ధారించారు డాక్టర్లు. మరి ఏ కారణంతో వీరు ఆత్మహత్య చేసుకున్నారు అనేది  తెలియడం లేదు. 

అసలేం జరిగింది..
కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్‌ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్‌గా చేస్తున్న బీబీపేట యువకుడు నిఖిల్‌ బుధవారం (డిసెంబర్ 25) మధ్యాహ్నం 1.26 గంటలకే వారి సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. కుమార్తె ఇంటికి రాకపోవడంతో శృతి తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు బుధవారం మధ్యాహ్నం నుంచి ఎస్సై సాయికుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని ఆయన భార్య సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఖిల్ కనిపించడం లేదని ఆయన కుటుంబసభ్యులు చుట్టుపక్కల అందర్నీ అడిగినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువులో బుధవారం అర్ధరాత్రి కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరుసటి రోజు ఉదయం ఎస్సై సాయికుమార్ మృతదేహం సైతం చెరువులో నుంచి బయటకు తీశారు.

వివాహేతర సంబంధమే కారణమా?
ఎస్సై సాయికుమార్ కు వివాహమైంది. సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. బీబీపేట పీఎస్‌లో పనిచేస్తున్న సమయంలో కానిస్టేబుల్ శృతి, ఎస్సై సాయికుమార్ కు రిలేషన్ ఉందని ప్రచారం జరుగుతోంది. తరువాత ఆయన బిక్కనూరుకు బదిలీ అయ్యారు. తనతో సంబంధం పెట్టుకున్నా.. ఎస్సై తనను పెళ్లి చేసుకోకపోవడం, ఆ సమయంలో తనకు పరిచయమైన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ను శృతి ప్రేమించింది. వీరు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో అడ్లూరి చెరువులో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వివాహేతర సంబంధమే ముగ్గురి ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.  

ఆత్మహత్యపై శృతి, నిఖిల్ ఛాటింగ్..
ఒకేచోట, ఒకేసారి ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంపై పోలీసులు కారణాలు అన్వేషిస్తున్నారు. కేసులో నిఖిల్, శృతిల చాటింగ్ కీలకంగా మారనుంది. నేను సూసైడ్ చేసుకుంటా అంటే.. నేను కూడా సూసైడ్ చేసుకుంటానని నిఖిల్, శృతి మధ్య చాటింగ్ జరిగినట్లు సమాచారం. వీరి ఫోన్లోలో డేటా పరిశీలిస్తున్నారు. ఎస్సై సాయికుమార్ కు చెందిన మూడు ఫోన్లలో ఒకటి అన్ లాక్ కాగా, పోలీసులు వివరాలు చెక్ చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, సూసైడ్ కు సంబంధించిన లేఖలు లేకపోవడంతో కేసు ముందుకు పోవడం లేదు. శుక్రవారం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. శనివారం మరోసారి చెరువు వద్ద సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది.

Also Read: Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Sankranti Buses : ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి దందా - ఒక్కో టిక్కెట్ ధర రూ.3వేలకుపైమాటే
ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి దందా - ఒక్కో టిక్కెట్ ధర రూ.3వేలకుపైమాటే
Sankranti Special Buses : సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
498A: అతుల్ సుభాష్‌లా ఆత్మహత్య చేసుకుంటేనే స్పందిస్తారా ? తన సోదరుడి దుస్థితిపై తెలుగు యువతి ఆవేదన - ఈ ప్రశ్నకు బదులేది?
అతుల్ సుభాష్‌లా ఆత్మహత్య చేసుకుంటేనే స్పందిస్తారా ? తన సోదరుడి దుస్థితిపై తెలుగు యువతి ఆవేదన - ఈ ప్రశ్నకు బదులేది?
Embed widget