Virat Kohli Inning Against CSK: కోహ్లీ... ఇలా ఆడటం కంటే డకౌట్ అయితే బెటర్, ఫ్యాన్స్ ఆగ్రహం
IPL 2025: కోహ్లీ ఆట తీరుపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా స్లో ఇన్నింగ్స్ ఆడటం కంటే డకౌట్ అయితే మంచిదని ఫైర్ అవుతున్నారు.

Virat Kohli Inning Against CSK: చెపాక్‌లో చెన్నైతో జరుగుతన్న మ్యాచ్‌లో బెంగళూరు 197 టార్గెట్ ఇచ్చింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను సాల్ట్, విరాట్ కోహ్లీ ప్రారంభించారు. సీఎస్‌కే బౌలర్లపై విరుచుకపడుతుంటే... కోహ్లీ మాత్రం ఆడలేక ఇబ్బంది పడ్డాడు. ఆఖరిలో కాస్త దూకుడు పెంచే ప్రయత్నం చేసినా అది ప్రయోజనం ఇవ్వలేదు. మొత్తానికి 30 బంతులు ఆడిన కోహ్లీ 31 పరుగులు మాత్రమే చేశాడు.
మొదటి మ్యాచ్‌లో 59 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించిన రన్ మెషిన్ పామ్‌లోకి వచ్చాడని అంతా భావించారు. కానీ రెండో మ్యాచ్‌లో మాత్రం బంతిని టచ్ చేయడానికే భయపడ్డట్టు కనిపించాడు. మొదటి పది బంతుల వరకు విరాట్ కోహ్లీకి స్ట్రైకింగ్ రాలేదు. తర్వాత వచ్చినా బంతిని టైం చేయలేక ఇబ్బంది పడ్డాడు.
14 years challenge ft. Virat Kohli pic.twitter.com/TWsE6X6s0v
— 𝐒𝐡𝐫𝐞𝐲𝐚𝐬𝐌𝐒𝐃𝐢𝐚𝐧™ (@Itzshreyas07) March 28, 2025
బంతిని అంచనా వేయడంలో లెక్క తప్పాడు. బంతిని పుల్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. యార్కర్లు ఆడలేకపోయాడు. పతిరానా వేసిన ఓ బంతి హెల్మెట్‌కు కూడా తగిలింది అంటే కోహ్లీ ఎంత ఇబ్బంది పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అదే కసితో సిక్స్, ఫోర్ కొట్టాడు. ఆ కసి ఇన్నింగ్స్ మొత్తంలో కనిపించలేదు. ఓసారి రనౌట్ నుంచి కూడా తప్పించుకున్నాడు.
1st ball – 😮💨
— Star Sports (@StarSportsIndia) March 28, 2025
2nd ball – 6️⃣
That’s what it’s like facing the GEN GOLD! ❤
Classy counter from #ViratKohli! 🙌🏻
Watch LIVE action ➡ https://t.co/MOqwTBm0TB#IPLonJioStar 👉 #CSKvRCB | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 3 & JioHotstar! pic.twitter.com/MzSQTD1zQc
Never seen more selfish player than Virat Kohli in my entire life 😆 pic.twitter.com/5drMta4dAe
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) March 28, 2025
స్పిన్ బౌలింగ్ ఆడటంలో కోహ్లీ చాలా ఇబ్బంది పడ్డాడు. నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా పూర్తిగా కోహ్లీని రౌండప్ చేశారు. చెన్నై ప్లేయర్లు క్యాచ్‌లు మిస్ చేయడం వల్ల కూడా కోహ్లీకి లైఫ్ వచ్చింది. చివరకు 12 ఓవర్‌లో కోహ్లీ ఇన్నింగ్స్‌ను నూర్ అహ్మద్ ముగించేశాడు. స్వీప్ ఆడిన కోహ్లి రచిన్ రవీంద్రకు దొరికిపోయాడు.
Bad innings from Kohli, not able to time at all and bad time to get out, hitting pace will be hard without him.
— Sai (@akakrcb6) March 28, 2025
ఈ ఇన్నింగ్స్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డకౌట్ అయితే సంతోషిస్తామని వేరే బ్యాటర్లు వచ్చి రన్స్ చేస్తారని అంటున్నారు. కోహ్లీ సెల్ఫిష్ ప్లేయర్ అని మండిపడుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌తో కోహ్లీ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. చెన్నైపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్‌ను అధిగమించాడు. మొదటి స్థానంలో కోహ్లీ ఉంటే రెండో ప్లేస్‌లో శిఖర్ ఉన్నాడు... మూడో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు.




















